సగం సీట్లతోనే థియేటర్లు ! వారికి భారీగా దెబ్బే..!

సగం సీట్లతోనే థియేటర్లు ! వారికి భారీగా దెబ్బే..!
కరోనా కేసుల భయంతో థియేటర్లలో సినిమా అనేది ఓ కాంప్లికేటెడ్ వ్యవహారంగా మారిపోయింది.

దేశంలో వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటంతో రాష్ట్రప్రభుత్వాలు ఆర్థికంగా దెబ్బ పడకుండా తాము చేయాల్సింది తాము చేస్తున్నాయ్. ఇందులో భాగంగా మాల్స్ రెస్టారెంట్స్, పై ఆంక్షలు విధించగా, కర్నాటక ప్రభుత్వం సినిమా హాల్స్‌లో ఏప్రిల్ 7 నుంచి సగం సీట్లతోనే నడపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ కూడా కన్నడ హీరోలు కొంతమందికి తమ సినిమాల విడుదల సందర్భంగా కొన్ని రోజులు మినహాయింపు ఇవ్వగా, వాటిపై విమర్శలు వచ్చాయ్. ఐనా సరే పునీత్ రాజ్‌కుమార్ యువరత్న సినిమా విడుదలైన మొదటి వారం 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి టిక్కెట్లు విక్రయించవచ్చంటూ మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు ఏప్రిల్ 7 నుంచి 50% ఆక్యుపెన్సీకే ఓటేశారు. మహారాష్ట్రలో అయితే వీకెండ్ లాక్‌డౌన్ పేరిట శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ మొత్తం బంద్ చేస్తున్నారు.

ముంబైలో ఇప్పటికే రెండు వారాల నుంచి సినిమా థియేటర్లపై ఆంక్షలు కొనసాగుతున్నాయ్. దీనికి తోడు ఇప్ఆంపుడు వీకెండ్ లాక్‌డౌన్‌తో మూడు రోజుల పాటు థియేటర్లు బంద్ అవుతాయ్. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీకే ఓటేయబోతున్నట్లు సమాచారం వస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో కూడా సేమ్ టూ సేమ్ సిచ్యుయేషన్. జైపూర్, కోల్‌కతానే కాకుండా మెట్రో నగరాల్లోని చాలా చోట్ల థియేటర్లలో జనం కన్పించని పరిస్థితి. మామూలుగానే ఈ సీజన్‌లో థియేటర్లకు డే షోలకు జనం రాని పరిస్థితి ఉండగా, దానికి తోడు కరోనా కేసుల భయం తోడవటంతో థియేటర్లలో సినిమా అనేది ఓ కాంప్లికేటెడ్ వ్యవహారంగా మారిపోయింది.

అందుకే ఇలాంటి పరిస్థితుల్లో పివిఆర్, ఐనాక్స్ లీజర్ వంటి షేర్ల జోలికి వెళ్లేవాళ్లు రిస్క్ తీసుకుంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా పివిఆర్‌కి హైదరాబాద్‌తో పాటు మైసూరులోని ఫోరమ్ సిటీ మాల్‌లో 6 స్క్రీన్లు నెల క్రితం అంటే మార్చి 5నే ప్రారంభించింది. దేశంలోనే 70 నగరాల్లో 845 స్క్రీన్లతో వ్యాపారం చేస్తోన్న పివిఆర్‌కి లాక్‌డౌన్ టైమ్‌లో భారీగా దెబ్బ పడింది. ఇప్పుడే బాగా పుంజుకుంటున్న టైమ్‌లో తిరిగి 50% ఆక్యుపెన్సీ నిబంధన మరోసారి ఆర్థికంగా ప్రభావం చూపేదే.తాజా ఆంక్షలతో ఒక్క స్క్రీనింగ్ మాత్రమే కాకుండా మల్టీప్లెక్స్‌లోని ఇతర వ్యాపారం కూడా భారీగా దెబ్బతింటోంది. అందుకే ఈ కంపెనీల షేర్లను కొనుగోలు చేసే ముందు, ఈ లిమిటేషన్ గుర్తు పెట్టుకోవాలంటూ సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story