Samsung : శాంసంగ్ నుంచి అప్ డేటెడ్ మొబైల్

శాంసంగ్ మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ పేరిట దీన్ని పరిచయం చేసింది. ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో తీసుకురావడం విశేషం. శాంసంగ్ కొత్త ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర ₹.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ +256జీబీ వేరియంట్ ధర ₹.20,999గా పేర్కొంది. బ్లూ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్.. రంగుల్లో ఈ మొబైల్ లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్డ్, శాంసంగ్ వెబ్‌సైట్లతో పాటు ఇతర రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ సాయంతో కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది. గెలాక్సీ కొత్త మొబైల్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే, 90హెచ్ జడ్ రిఫ్రెష్ రేటు కలిగిఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ సాయంతో 1టీబీ వరకు స్టోరేజీ పెంచుకొనే సదుపాయం ఉందని కంపెనీ చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com