SBI : ఎస్బీఐ లోన్ వడ్డీరేట్లు భారీగా తగ్గింపు!

X
By - Manikanta |17 Oct 2024 5:15 PM IST
దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు ప్రతి నెల రుణాలపై, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను వెల్లడించింది. ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 8.45 శాతం నుంచి 8.20 శాతానికి తగ్గించింది.అలాగే ఎంపిక చేసిన టెన్యూర్ లోన్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇక మిగతా టెన్యూర్లపై వడ్డీ రేట్లు యథాతథంగానే ఉంటాయని ప్రకటించింది. ఈ నిర్ణయం అక్టోబర్ 15 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు బ్యాంక్ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com