SBI Focused Fund Magic : ఎస్‌బీఐలో రూ.10 వేలు పెడితే రూ.1.54 కోట్లు..అక్షరాలా నిజం..నమ్మలేకపోతున్నారా?

SBI Focused Fund Magic : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే చాలామంది రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోవాలని కోరుకుంటారు. కానీ, అసలైన సంపద సృష్టించాలంటే కావాల్సింది వేగం కాదు, ఓపిక. దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఎస్‌బీఐ ఫోకస్డ్ ఫండ్. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిని ఎలా చేస్తుందో ఈ ఫండ్ నిరూపించింది. గత 20 ఏళ్లలో ఈ ఫండ్ సృష్టించిన సంపద ఇప్పుడు ఇన్వెస్టర్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
చాలామంది స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు భయపడి పెట్టుబడులకు దూరంగా ఉంటారు. కానీ దీర్ఘకాలంలో మార్కెట్ ఇచ్చే రిటర్న్స్ ఏ బ్యాంకు ఎఫ్‌డీలు కూడా ఇవ్వలేవని ఎస్‌బీఐ ఫోకస్డ్ ఫండ్ నిరూపించింది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఎవరైనా ఈ ఫండ్‌లో నెలకు కేవలం 10,000 రూపాయల చొప్పున ఎస్ఐపీ ప్రారంభించి ఉంటే, వారు నేడు ఏకంగా రూ.1.54 కోట్ల భారీ నిధికి యజమానులయ్యేవారు. అంటే ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి తన పదవీ విరమణ సమయానికి లేదా పిల్లల భవిష్యత్తు కోసం ఇంత పెద్ద మొత్తాన్ని సులభంగా పోగుచేయగలిగే అవకాశం ఈ ఫండ్ ద్వారా లభించింది.
ఎస్‌బీఐ ఫోకస్డ్ ఫండ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం ఒకట్రెండు ఏళ్లు మాత్రమే కాదు, దశాబ్ద కాలంగా నిలకడైన ప్రదర్శన కనబరుస్తోంది. గత 3, 5, 10, 20 ఏళ్ల కాలపరిమితిలో ఈ ఫండ్ ప్రతిసారీ 16 శాతం కంటే ఎక్కువ వార్షిక రిటర్న్స్‌ను అందించింది.
గత 3 ఏళ్ల ఎస్ఐపీపై వార్షిక రిటర్న్ (CAGR): 18.56%
గత 5 ఏళ్ల ఎస్ఐపీపై వార్షిక రిటర్న్: 16.04%
గత 10 ఏళ్ల ఎస్ఐపీపై వార్షిక రిటర్న్: 16.09% ఏ కాలంలో చూసినా ఇన్వెస్టర్లకు నష్టపోకుండా మెరుగైన లాభాలను అందించిన ఏకైక ఎస్‌బీఐ ఫండ్‌గా ఇది గుర్తింపు పొందింది.
కేవలం నెలనెలా కట్టే ఎస్ఐపీ మాత్రమే కాదు, ఒకేసారి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారి అదృష్టం కూడా ఈ ఫండ్‌లో పండింది. 20 ఏళ్ల క్రితం పెట్టిన ఆ ఒక్క లక్ష నేడు అనేక రెట్లు పెరిగి ఉంటుంది. అయితే, మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సామాన్య ఇన్వెస్టర్లకు మార్కెట్ రిస్క్ తగ్గించుకోవడానికి ఎస్ఐపీ పద్ధతే అత్యంత సురక్షితమైనది.
ఎస్‌బీఐ ఫోకస్డ్ ఫండ్ ఇతర మ్యూచువల్ ఫండ్స్ లాగా వందల కంపెనీలలో పెట్టుబడి పెట్టదు. ఇది చాలా పకడ్బందీగా గరిష్టంగా 30 కంపెనీలనే ఎంచుకుంటుంది. ఫండ్ మేనేజర్‌కు ఏ కంపెనీల మీద పూర్తి నమ్మకం ఉంటుందో, వాటిలోనే పెట్టుబడి పెడతారు. కనీసం 65 శాతం నిధులను ఎప్పుడూ షేర్ మార్కెట్లోనే ఉంచుతూ.. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలలో బాలెన్సుడ్గా పెట్టుబడి పెడుతుంటుంది. దీనివల్ల రిస్క్ తక్కువగా ఉండి రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

