SBI Report: శత స్వాతంత్రం నాటికి అంచనాలను మించి ఆర్థిక వృద్ధి

భారత దేశ వందవ స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకునే నాటికి దేశంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరగనుందని SBI తెలిపింది. అంటేప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరం ఉన్న 2 లక్షల నుంచి 14 లక్షల తలసరి ఆదాయం 2047 నాటికి దాదాపు ఏడున్నర రెట్లు పెరగనుందని SBI రీసెర్చి ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని అనుకుంటున్న క్రమంలో తలసరి ఆదాయంతో పాటు మరికొన్ని గణాంకాలను SBI రీసెర్చి ప్రకటించింది. ఇక 2021-22లో పన్ను చెల్లింపుదారుల సగటు ఆదాయం 13 లక్షలుండగా ఉండగా.. 2047 నాటికి అది దాదాపు 50 లక్షలకు పెరగనుందని వెల్లడించింది. అప్పటికల్లా నిమ్నాదాయ వర్గాలు, అధిక ఆదాయ వర్గాలుగా మారనున్నారని పేర్కొంది. ఇక పన్ను చెల్లింపుదారుల సంఖ్య ప్రస్తుత ఎనిమిదిన్నర కోట్లు ఉండగా అది ఇకపై 48 కోట్లకు పెరగనుందని SBI నివేదిక తెలిపింది. పన్ను పరిధిలోకి వచ్చే శ్రామిక శక్తి 2022-23లో 22.4 శాతం నుంచి 85.3 శాతానికి పెరగనుందని అంచనా వేసింది. జీరో ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 25 శాతం మేర తగ్గనుందని అంచనా కట్టింది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com