Silver Prices Crash : కొందామనుకున్న వాళ్లకి పండగ..కొన్న వాళ్లకి దండగ..ఒక్కరోజే 9 శాతం పతనమైన వెండి.

Silver Prices Crash : కొందామనుకున్న వాళ్లకి పండగ..కొన్న వాళ్లకి దండగ..ఒక్కరోజే 9 శాతం పతనమైన వెండి.
X

Silver Prices Crash : లియన్ మార్కెట్‌లో వెండి ధగధగలు తగ్గుతున్నాయి. గత రెండు రోజులుగా లాభాలతో ఊరించిన వెండి, ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ఈ తెల్ల బంగారం ధరలు భారీగా క్షీణించాయి. ఇన్వెస్టర్లు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో ధరలు కుప్పకూలాయి.

శుక్రవారం బులియన్ మార్కెట్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది. స్పాట్ సిల్వర్ ధర ఏకంగా 8.9 శాతం మేర పడిపోయి, ఒకానొక దశలో 64.88 డాలర్ల వద్దకు చేరుకుంది. కీలకమైన 65 డాలర్ల మార్కును కూడా ఇది అధిగమించలేకపోయింది. గత వారమే వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగి, ఒకే వారంలో ఏకంగా 121.63 డాలర్ల మేర పెరగడం విశేషం. అయితే, గురువారం నుంచి ప్రారంభమైన లాభాల స్వీకరణ వల్ల ఆ పెరిగిన లాభాలన్నీ ఇప్పుడు ఆవిరైపోయాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడం కూడా ధరలు తగ్గడానికి ఒక కారణంగా కనిపిస్తోంది.

వెండి బాటలోనే బంగారం కూడా పయనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‎లో బంగారం ధర కీలకమైన 4,750 డాలర్ల సపోర్ట్ లెవల్‌ను కోల్పోయింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ధర 4,671 డాలర్ల వద్దకు పడిపోయింది. వెండి విషయంలో కూడా ఇదే జరిగింది. 70 డాలర్ల వద్ద పటిష్టమైన సపోర్ట్ ఉంటుందని భావించినా, అది కూడా ముక్కలై 63.90 డాలర్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ఈ పరిస్థితికి దారితీసింది.

నిపుణుల విశ్లేషణ ప్రకారం.. మార్కెట్లో ధరలు భారీగా పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న నిల్వలను అమ్మి లాభాలను గడించాలనుకుంటారు. దీనినే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. శుక్రవారం ఇదే జరిగింది. దీనికి తోడు అమెరికా డాలర్ బలంగా మారడంతో, ఇతర కరెన్సీలు వాడే దేశాలకు బంగారం, వెండి కొనడం భారంగా మారింది. ఫలితంగా డిమాండ్ తగ్గి ధరలు పడిపోయాయి. రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్ మరింత స్థిరపడే వరకు ఈ ఊగిసలాట కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Tags

Next Story