Skoda : స్కోడా కార్లపై భారీ డిస్కౌంట్.. రూ.3.5 లక్షల వరకు బంపర్ ఆఫర్.. కారు కొనడానికి ఇదే బెస్ట్ టైం.

Skoda : స్కోడా కార్లపై భారీ డిస్కౌంట్.. రూ.3.5 లక్షల వరకు బంపర్ ఆఫర్.. కారు కొనడానికి ఇదే బెస్ట్ టైం.
X

Skoda : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే ఛాన్స్. ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా తన కస్టమర్ల కోసం కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. ఏప్రిల్ నెలలో తన పాపులర్ మోడళ్లపై ఏకంగా రూ.45 వేల నుంచి రూ.3.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. కైలాక్, స్లావియా, కుషాక్, కోడియాక్ వంటి కార్లపై క్యాష్ డిస్కౌంట్లతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా అందిస్తోంది.

స్కోడా కైలాక్ పై ఆఫర్లు

స్కోడా ఫ్యామిలీలో ఎంట్రీ లెవల్ మోడల్ అయిన కైలాక్ కారుపై కంపెనీ రూ.45,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఒకవేళ మీరు 2025 లేదా 2026 ప్రారంభంలో తయారైన మోడళ్లను ఎంచుకుంటే, ఈ ఆదా రూ.75,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

స్లావియా పై తగ్గింపు

స్టైలిష్ సెడాన్ స్లావియాపై ప్రస్తుతం రూ.75,000 వరకు పొదుపు చేసుకోవచ్చు. అయితే 2025లో తయారైన యూనిట్లపై మాత్రం ఏకంగా రూ.1.05 లక్షల వరకు లాభం చేకూరుతోంది. ఇందులో రూ.30,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.50,000 కార్పొరేట్/లాయల్టీ బోనస్ కలిసి ఉన్నాయి. సెడాన్ కార్లను ఇష్టపడేవారికి ఇది గొప్ప అవకాశం.

కుషాక్ పై కళ్లు చెదిరే ఆఫర్

ఎస్‌యూవీ విభాగంలో స్కోడా అత్యధిక డిస్కౌంట్లను తన కుషాక్ మోడల్ పైనే ఇస్తోంది. కొత్త మోడళ్లపై రూ.1.05 లక్షల వరకు ఆఫర్లు ఉండగా, షోరూమ్‌లలో ఉన్న 2024, 2025 నాటి పాత స్టాక్ యూనిట్లపై ఏకంగా రూ.3 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందులో రూ.2 లక్షల భారీ క్యాష్ డిస్కౌంట్ ఉండటం విశేషం. మిగిలిన రూ.లక్ష ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ బోనస్ రూపంలో అందుతుంది.

లగ్జరీ కోడియాక్ పై భారీ ఆదా

స్కోడా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ కోడియాక్ పై గరిష్టంగా రూ. 3.5 లక్షల వరకు ఆఫర్ లభిస్తోంది. 2025లో అసెంబుల్ చేసిన యూనిట్లపై రూ. 2 లక్షల నగదు తగ్గింపు, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. లక్ష కార్పొరేట్ డిస్కౌంట్ కంపెనీ ఇస్తోంది. లగ్జరీ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. స్టాక్ ముగిసేలోపు దగ్గరలోని స్కోడా డీలర్‌షిప్‌ను సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

Tags

Next Story