Skoda Kylaq : స్కోడా లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..భారీగా పెరిగిన కైలాక్ ధర.

Skoda Kylaq : యూరోపియన్ కార్లంటే ఉండే క్రేజే వేరు. ఆ క్వాలిటీ, ఆ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారి కోసం స్కోడా ఇండియా అందించిన అత్యంత చౌకైన కారు స్కోడా కైలాక్. అయితే, కొత్త ఏడాదిలో ఈ కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి కంపెనీ షాక్ ఇచ్చింది. ముడి సరుకుల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల కైలాక్ ధరలను రూ.19,295 వరకు పెంచుతున్నట్లు స్కోడా ప్రకటించింది.
స్కోడా కైలాక్ మొత్తం నాలుగు ప్రధాన వేరియంట్లలో (Classic, Signature, Signature+, Prestige) లభిస్తుంది. ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారం, కైలాక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.59 లక్షల నుంచి రూ. 12.99 లక్షల మధ్య ఉండనుంది.
* ఎంట్రీ లెవల్ క్లాసిక్ (Classic): ఇందులో అతి తక్కువగా రూ. 4,349 పెరిగింది.
* సిగ్నేచర్ (Signature MT/AT): ఈ వేరియంట్లపై రూ. 10,000 వరకు భారం పడింది.
* టాప్ మోడల్ ప్రెస్టీజ్ (Prestige AT): అత్యధికంగా రూ. 19,295 పెరిగింది.
* ప్రెస్టీజ్ ఎంటీ (Prestige MT): ఈ వేరియంట్ ధర రూ. 15,341 పెరిగింది.
స్కోడా చరిత్రలోనే కైలాక్ ఒక గేమ్ చేంజర్‌గా నిలిచింది. 2025 సంవత్సరంలో స్కోడా ఇండియా ఏకంగా 107 శాతం వృద్ధిని సాధించడంలో ఈ కారు కీలక పాత్ర పోషించింది. గత ఏడాది అమ్ముడైన మొత్తం 72,665 కార్లలో, కేవలం కైలాక్ వాటానే 45,000 యూనిట్లు (దాదాపు 62%) ఉండటం విశేషం. స్కోడా భారత్‌లోకి ప్రవేశించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలో, ఇంత భారీ విజయాన్ని అందించిన ఘనత ఈ సబ్-4 మీటర్ ఎస్‌యూవీకే దక్కుతుంది.
స్కోడా కైలాక్ మార్కెట్లో అత్యంత పోటీ ఉన్న విభాగంలో ఉంది. ఇది నేరుగా టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటి దిగ్గజ కార్లతో తలపడుతోంది. భద్రత విషయంలో Bharat NCAP నుంచి 5-స్టార్ రేటింగ్ పొందడం, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఈ కారుకున్న అతిపెద్ద ప్లస్ పాయింట్లు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

