Skoda : స్కోడాకు అదృష్టంగా మారిన కైలాక్ ఎస్యూవీ.. సెప్టెంబర్ సేల్స్ డబుల్.

Skoda : స్కోడాకు అదృష్టంగా మారిన కైలాక్ ఎస్యూవీ.. సెప్టెంబర్ సేల్స్ డబుల్.
X

Skoda : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్కోడా ఆటో ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ముఖ్యంగా కంపెనీ విడుదల చేసిన కొత్త ఎస్‌యూవీ కైలాక్, స్కోడాకు వరంగా మారింది. ఈ కారు అమ్మకాల జోరుతో, స్కోడా తన చరిత్రలోనే అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. 2025లో స్కోడా తన అమ్మకాల సంఖ్యను రెట్టింపు చేసుకోవడంలో ఈ కైలాక్ ఎస్‌యూవీ కీలక పాత్ర పోషించింది.

స్కోడా ఆటో ఇండియా 2025 సంవత్సరం మూడవ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఏకంగా 110 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ 2025 నెల కంపెనీకి చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఈ నెలలో స్కోడా ఏకంగా 6,636 కార్లను విక్రయించింది, ఇది గత సంవత్సరం సెప్టెంబర్ కంటే 101 శాతం ఎక్కువ. ఈ అసాధారణ వృద్ధికి ప్రధాన కారణం, కంపెనీ కొత్తగా విడుదల చేసిన కైలాక్ ఎస్‌యూవీయే. ఇది విడుదలైనప్పటి నుంచి వినియోగదారుల దృష్టిని ఆకర్షించి, కంపెనీకి టాప్-సెల్లింగ్ కారుగా మారింది.

కైలాక్‌తో పాటు, కుషాక్ , స్లావియా, కోడియాక్ వంటి మోడళ్లు కూడా తమ అమ్మకాల ద్వారా స్థిరమైన వృద్ధికి దోహదపడ్డాయి. 2025లో స్కోడా సాధించిన బలమైన వృద్ధికి కైలాక్ ఉత్పత్తి బలమే ప్రధాన ఆధారం. బ్రాండ్ మొట్టమొదటి సబ్-4 మీటర్ ఎస్‌యూవీ కైలాక్. జనవరి నుంచి సెప్టెంబర్ 2025 మధ్య కాలంలో కైలాక్ అమ్మకాలు ఇప్పటికే 34,500 యూనిట్ల మార్కును దాటాయి. కంపెనీ మొత్తం 53,355 యూనిట్ల అమ్మకాలలో కీలక పాత్ర పోషించాయి.

ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే పర్ఫామెన్స్ కారణంగానే మార్కెట్‌లో ఇంతటి పోటీ ఉన్నప్పటికీ స్కోడా పురోగతి సాధిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. స్కోడా కైలాక్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 999cc సామర్థ్యం గల 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 114 bhp శక్తిని, 178 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ (DC/TC) ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. కైలాక్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్‌లు, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. దీని బూట్ స్పేస్ 446 లీటర్లు కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 189 మి.మీ ఉంది. దీని ధర రూ.7.55 లక్షల నుంచి రూ.12.80 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

Tags

Next Story