SWISS BANK: స్విస్ బ్యాంకుల్లో పెరుగుతున్న పెద్దల సంపద

చాలాకాలం నుంచే స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్విస్ బ్యాంకుల్లో దాచిన డబ్బంతా బ్లాక్ మనీ అనే వాదన చాలా కాలం నుంచి కొనసాగుతోంది. భారత్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. 2024లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఏకంగా మూడింతలు పెరిగినట్లు తేలింది.స్విస్ నేషనల్ బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆ దేశ బ్యాంకుల్లో ఉన్న మెుత్తం భారతీయలు డబ్బు రూ.37వేల 600 కోట్లు. 2021 తర్వాత భారతీయ ఖాతాదారుల డబ్బు ఇంత భారీగా పెరగటం ఇదే తొలిసారి. నేరుగా ఖాతాల్లో డబ్బు దాచటం కేవలం 11 శాతం మాత్రమే పెరిగిందని తేలింది. దీనికి ముందు 2023లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు భారీగా వెనక్కి తీసుకోబడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం స్విస్ బ్యాంకుల్లో ఉన్న మెుత్తం డబ్బును బ్లాక్ మనీ అనటానికి వీల్లేదు. తమ బ్యాంకుల్లో ఉన్న డబ్బు మెుత్తాన్ని పన్ను ఎగవేత సొమ్ముగా పరిగణించొద్దని, తాము ఖాతాల వివరాలను భారత ప్రభుత్వంతో పంచుకుంటున్నామని అక్కడి అధికారులు చెబుతున్నారు.
భారీగా పెరిగిన భారతీయుల డబ్బు
స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకునే డబ్బు ఏడాదిలో భారీగా పెరిగిపోయింది. 2024లో మూడింతలు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు అంటే సుమారు రూ. 37,600 కోట్లకు చేరింది. ఇది 2023లో 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు అంటే రూ. 9,771 కోట్లు మాత్రమే. 2021 తర్వాత అత్యధికం అని రికార్డులు చెబుతున్నాయి. ఆ సంవత్సరం భారతీయుల డబ్బు 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు అంటే సుమారు రూ. 30,500 కోట్లు స్విస్ బ్యాంకుల వద్ద ఉంది. అయితే ఆ తర్వాత ఒక్క సారిగా భారతీయులు స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేశారు. 2023లో 70 శాతం తగ్గిపోయింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా పెరుగుతోంది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ డబ్బు వివిధ రూపాల్లో ఉందని నివేదికలు చెబుతున్నాయి. 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు అంటే సుమారు రూ. 3,675 కోట్లు కస్టమర్ డిపాజిట్ల ద్వారా ఉన్నాయి. ఇతర బ్యాంకుల ద్వారా స్విస్ బ్యాంకుల్లోకి వచ్చిన 3.02 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లుగా తేల్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com