Stock Market : ఫ్లాట్గా ముగిసిన మార్కెట్
భారత స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచగా.. ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఉదయం 84,257.17 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ.. కాసేపటికే లాభాల్లోకి వచ్చింది. ఇంట్రాడేలో 84,648.40 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. చివరికి 33.49 పాయింట్ల నష్టంతో 84,266.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 13.95 పాయింట్ల నష్టంతో 25,796.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.82గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 70.77 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2671 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com