Stock Market : లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్.. ఆరంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్లు పైకి.

Stock Market : లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్.. ఆరంభంలోనే సెన్సెక్స్ 200 పాయింట్లు పైకి.
X

Stock Market : భారత స్టాక్ మార్కెట్ ఈ వారం తొలి ట్రేడింగ్ సెషన్‌ను (నవంబర్ 17, సోమవారం) పాజిటివ్‎గా ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన వెంటనే ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు అయిన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 రెండూ లాభాలతో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఈ రోజు సెన్సెక్స్ 137.72 పాయింట్లు (0.16 శాతం) పెరిగి 84,700.50 వద్ద, నిఫ్టీ 38.15 పాయింట్లు (0.15 శాతం) పెరిగి 25,948.20 వద్ద ఓపెన్ అయ్యాయి.

ఉదయం 9:22 గంటల సమయానికి మార్కెట్ జోరు మరింత పెరిగింది. సెన్సెక్స్ 199 పాయింట్ల వేగంతో 84,762 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 25,963 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ మళ్లీ 25,974 స్థాయిని దాటేందుకు సిద్ధమవుతోంది.

బీఎస్ఈ టాప్ గెయినర్స్ : కోటక్ బ్యాంక్, ఎస్బీఐఎన్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ,

బీఎస్ఈ టాప్ లూజర్స్ : ఇటర్నల్, టాటా స్టీల్, టీసీఎస్, పవర్‌గ్రిడ్,

గత శుక్రవారం (నవంబర్ 14) కూడా భారత స్టాక్ మార్కెట్ లాభాలతోనే ముగిసింది. ఆ రోజు సెన్సెక్స్ 84.11 పాయింట్లు (0.10 శాతం) పెరిగి 84,562.78 వద్ద, నిఫ్టీ 30.90 పాయింట్లు (0.12 శాతం) లాభంతో 25,910.05 వద్ద ముగిశాయి.

గెయినర్స్: ఇటర్నల్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐఎన్, బజాజ్ ఫైనాన్స్ శుక్రవారం లాభపడ్డాయి.

లూజర్స్: ఐఎన్ఎఫ్వై, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతి నష్టాలను చవిచూశాయి.

రంగాల వారీగా చూస్తే, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్‌క్యాప్, నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీలు లాభపడ్డాయి. అయితే నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ షేర్లలో మాత్రం కొంత క్షీణత కనిపించింది.

Tags

Next Story