Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ ఒక్కటి చెక్ చేయకపోతే మీ డబ్బులన్నీ పోయినట్లే!

Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ ఒక్కటి చెక్ చేయకపోతే మీ డబ్బులన్నీ పోయినట్లే!
X

Health Insurance : ఈ రోజుల్లో ఏదైన రోగం వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళితే అక్కడ చికిత్స చాలా ఖరీదైపోయింది. ఒక్కోసారి ఆసుపత్రి ఖర్చుల కోసం జీవితాంతం సంపాదించిన డబ్బంతా ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని ధీమాగా ఉంటారు. అయితే, మీరు తీసుకున్న పాలసీలో క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కవరేజ్ ఉందో లేదో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు, తీరా అవసరం వచ్చినప్పుడు తమ సొంత డబ్బు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ ముఖ్యమైన వివరాలను తప్పక తనిఖీ చేయాలి.

పొదుపు మొత్తాన్ని కరిగిస్తున్న తీవ్ర వ్యాధులు తీవ్రమైన వ్యాధుల బారిన పడినప్పుడు, ప్రజలు తమ జీవితకాల సంపాదనను కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధుల చికిత్స చాలా ఖరీదైనది. ఎక్కువ కాలం కొనసాగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నవారికి కొంత ప్రయోజనం లభిస్తుంది. కానీ, చాలా సందర్భాల్లో ప్రజలు తమ హెల్త్ పాలసీలో తీవ్రమైన వ్యాధుల కవరేజీని తీసుకోరు. దీనివల్ల, ఏదైనా తీవ్రమైన అనారోగ్యం వస్తే, వారు తమ సొంత పొదుపు నుంచి పెద్ద మొత్తంలో డబ్బును చికిత్స కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది.

పాలసీ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత..

మీరు ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే, మీ పాలసీ తీవ్రమైన వ్యాధులను కవర్ చేస్తుందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి. ఒకవేళ మీరు కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, ఈ కవరేజ్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇది భవిష్యత్తులో మీకు, మీ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది.

పాలసీని ఎలా ఎంచుకోవాలి?

వివిధ బీమా కంపెనీలు రకరకాల పాలసీలను అందిస్తాయి. వాటి ప్రీమియంలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని కంపెనీలు వివిధ వ్యాధుల కోసం ప్రత్యేక పాలసీలను కూడా ఇస్తాయి. కొన్ని పాలసీలు 100 కంటే ఎక్కువ వ్యాధులను కవర్ చేస్తాయి. మీరు మీ పాలసీని ఎంచుకునేటప్పుడు, తీవ్రమైన వ్యాధులను కవర్ చేసే పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు ముందే పాలసీ తీసుకుని ఉంటే, ఈ కవరేజీని యాడ్-ఆన్ రూపంలో కూడా జోడించుకోవచ్చు.

సీఐ (క్రిటికల్ ఇల్నెస్) రైడర్ అంటే ఏమిటి?

సీఐ రైడర్ అనేది ఒక అదనపు బీమా కవరేజ్. దీనిని టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి జోడించుకోవచ్చు. ఈ రైడర్ కింద క్యాన్సర్, స్ట్రోక్, గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, కొన్ని పెద్ద సర్జరీలు వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్స కోసం మీకు కవరేజ్ లభిస్తుంది. ఈ కవరేజ్ కింద, వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే మీకు పాలసీ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు.

Tags

Next Story