Best Diesel Cars : టాటా ఆల్ట్రోజ్ నుంచి కియా సోనెట్ దాకా..రూ. 10 లక్షల లోపే బెస్ట్ డీజిల్ కార్లు ఇవే.

Best Diesel Cars : టాటా ఆల్ట్రోజ్ నుంచి కియా సోనెట్ దాకా..రూ. 10 లక్షల లోపే బెస్ట్ డీజిల్ కార్లు ఇవే.
X

Best Diesel Cars : నేటి కాలంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నా, సీఎన్‌జీ కార్ల హవా పెరుగుతున్నా.. డీజిల్ కార్ల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ వెళ్లేవారికి, ఎక్కువ మైలేజీ కావాలనుకునే వారికి డీజిల్ ఇంజన్లే మొదటి ఛాయిస్. డీజిల్ కార్లు మంచి టార్క్ ఇస్తాయి, అంటే ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై కూడా కారు అలవోకగా దూసుకుపోతుంది. ఒకప్పుడు డీజిల్ కార్లు అంటే ఖరీదైనవి అనే ముద్ర ఉండేది. కానీ ఇప్పుడు రూ.10 లక్షల లోపే అద్భుతమైన ఫీచర్లు, అదిరిపోయే మైలేజీ ఇచ్చే డీజిల్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో వివరంగా చూద్దాం.

1. టాటా ఆల్ట్రోజ్ డీజిల్

భారతదేశంలో లభించే అత్యంత చౌకైన డీజిల్ కారు ఇదే. దీని బేస్ డీజిల్ వేరియంట్ ధర సుమారు రూ.8.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 23.6 కి.మీ మైలేజీని ఇస్తుంది. దీనికి గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండటం మరో విశేషం. సురక్షితమైన ప్రయాణం, తక్కువ మెయింటెనెన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ హ్యాచ్‌బ్యాక్.

2. కియా సోనెట్ డీజిల్

స్టైలిష్ లుక్ మరియు ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి కియా సోనెట్ చక్కని ఎంపిక. దీని HTE (O) డీజిల్ వేరియంట్ ధర సుమారు రూ.8.98 లక్షల వద్ద లభిస్తుంది. ఈ కారు లీటరుకు దాదాపు 24.1 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఈ విభాగంలో అత్యధిక మైలేజీ ఇచ్చే కార్లలో ఇది ఒకటి. యువతను ఆకట్టుకునేలా దీని డిజైన్, లోపల ఫీచర్లు ఉంటాయి.

3. మహీంద్రా XUV 3XO డీజిల్

మహీంద్రా నుంచి వచ్చిన ఈ సరికొత్త SUV మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీని MX2 డీజిల్ వేరియంట్ ధర రూ.8.95 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది 20.1 కి.మీ మైలేజీని ఇస్తుంది. పవర్‌ఫుల్ ఇంజన్, విశాలమైన క్యాబిన్ దీని ప్రత్యేకత. దీనికి కూడా సేఫ్టీ పరంగా 5-స్టార్ రేటింగ్ లభించింది. బరువైన లోడ్లు వేసుకుని కూడా ఈ కారు అలవోకగా వెళ్లగలదు.

4. టాటా నెక్సాన్ డీజిల్

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్ ఒకటి. దీని స్మార్ట్ ప్లస్ డీజిల్ వేరియంట్ ధర సుమారు రూ.9.01 లక్షల నుంచి ఉంటుంది. ఇది లీటరుకు 23.2 కి.మీ మైలేజీని ఇస్తుంది. హైవే డ్రైవింగ్‌లో ఈ కారు చాలా స్థిరంగా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి సేఫ్టీ పరంగా ఇది తిరుగులేని ఎంపిక.

5. హ్యుందాయ్ వెన్యూ డీజిల్

నమ్మకమైన బ్రాండ్, స్మూత్ డ్రైవింగ్ అనుభవం కావాలనుకునే వారికి హ్యుందాయ్ వెన్యూ సరైనది. దీని HX 2 డీజిల్ వేరియంట్ ధర సుమారు రూ.9.80 లక్షల వద్ద ఉంటుంది. ఇది 21 కి.మీ మైలేజీని ఇస్తుంది. సిటీ డ్రైవింగ్‌లో ఈ కారు చాలా తేలికగా అనిపిస్తుంది. సర్వీస్ నెట్‌వర్క్ కూడా బలంగా ఉండటం దీనికి అదనపు ప్లస్.

Tags

Next Story