Tata Curvv SUV : టాటా కర్వ్ కూపే ఎస్‌యూవీకి భారీ డిమాండ్.. డెలివరీ కోసం 87 రోజులు ఆగాల్సిందే.

Tata Curvv SUV : టాటా మోటార్స్ కొత్తగా మార్కెట్‌లోకి విడుదల చేసిన కప్ కూపే స్టైల్ ఎస్‌యూవీ కర్వ్ వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ కారుకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ కారణంగా డెలివరీ టైమ్ భారీగా పెరిగింది. ఈ ఎస్యూవీని కొనుగోలు చేయాలనుకునే వారు బుకింగ్ చేసిన తర్వాత 8 నుంచి 12 వారాలు లేదా సుమారు 87 రోజుల వరకు వేచి ఉండక తప్పదు. కర్వ్ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ అనే మూడు పవర్‌ట్రైన్‌లలో అందుబాటులో ఉండడం దీని ప్రత్యేకత.
టాటా కర్వ్ ఎస్‌యూవీకి ప్రస్తుతం 8 నుంచి 12 వారాల (దాదాపు 87 రోజులు) వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ సమయం మీరు ఎంచుకునే వేరియంట్, రంగు, డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు. టాటా కర్వ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9,65,690 నుంచి మొదలై, టాప్ స్పెసిఫికేషన్ వేరియంట్‌కు రూ.17,16,090 వరకు ఉంటుంది. కర్వ్ ను టాటా కొత్త అట్లాస్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇది Smart, Pure, Creative, Achieved అనే నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది.
ఇతర ఎస్‌యూవీలకు భిన్నంగా, టాటా కర్వ్ సరికొత్త, అడ్వాన్సుడ్ ఇంజన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులో కొత్తగా పరిచయం చేసిన 1.2 లీటర్ GDi టర్బో పెట్రోల్ (హైపెరియన్ ఇంజన్) ముఖ్యమైనది. ఇది 124 bhp శక్తిని, 225 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మెరుగైన రెస్పాన్స్‌తో పాటు హై-ఎండ్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ (MT) లేదా 7-స్పీడ్ డీసీఏ (DCA) ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.
రెండవది, 1.2 లీటర్ స్టాండర్డ్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 119 bhp, 170 Nm టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ కూడా 6-స్పీడ్ MT లేదా 7-స్పీడ్ DCA గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇక డీజిల్ విషయానికి వస్తే, 1.5 లీటర్ క్రైయోటెక్ డీజిల్ ఇంజన్ 117 bhp పవర్, 260 Nm టార్క్ ఇస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే.. డీజిల్ ఇంజన్‌కు 7-స్పీడ్ DCA గేర్‌బాక్స్‌ను పొందిన సెగ్మెంట్‌లోని మొదటి ఎస్‌యూవీ ఇది కావడం విశేషం. ఈ డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ MTతో కూడా అందుబాటులో ఉంది.
కప్ కూపే తరహా ప్రొఫైల్ కారణంగా టాటా కర్వ్ తన సెగ్మెంట్‌లో చాలా ప్రత్యేకంగా, ప్రీమియంగా కనిపిస్తుంది. ఇంజన్‌కు కూలింగ్ అందించేందుకు ముందు భాగంలో రిఫ్రెష్ గ్రిల్, వెంట్‌లు డిజైన్ చేశారు.. ICE మోడల్స్ ఈవీ మోడల్స్ కంటే భిన్నమైన 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటాయి.
క్యాబిన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 12.3-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 9-స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే / ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెనుక భాగంలో వెలుగుతున్న టాటా లోగోతో కూడిన ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. టాటా కర్వ్ సేఫ్టీ విషయంలో కూడా రాజీ పడలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ & లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ ఫీచర్లు ఉన్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

