Tata Curvv SUV : క్రెటా, సెల్టోస్‌లకు గట్టి పోటీ.. కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన టాటా కర్వ్.

Tata Curvv SUV : క్రెటా, సెల్టోస్‌లకు గట్టి పోటీ.. కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన టాటా కర్వ్.
X

Tata Curvv SUV : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఎస్‌యూవీ-కూపే శ్రేణిలో కొత్త మోడల్‌ను అప్‌డేట్ చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. అదే టాటా కర్వ్ ఎస్‌యూవీ. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో లాంచ్ అయిన ఈ కారు, మెరుగైన డిజైన్, లగ్జరీ ఇంటీరియర్స్, అడ్వాన్సుడ్ ఫీచర్లతో వచ్చింది. మధ్య-శ్రేణి ఎస్‌యూవీ మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి బలమైన పోటీదారులకు ఈ కొత్త కర్వ్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా అందించిన సరికొత్త ఫీచర్లు, ధర, భద్రతా వివరాలు చూద్దాం.

టాటా మోటార్స్ తన కర్వ్ ఎస్‌యూవీ-కూపే శ్రేణిని అప్‌డేట్ చేసి, మెరుగైన ఫీచర్లతో విడుదల చేసింది. ఈ అప్‌డేట్‌లో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్‌లకు డిజైన్, కంఫర్ట్ ఫీచర్లను జోడించారు. ఈ అప్‌డేట్ ముఖ్యంగా కారు క్యాబిన్ స్పేస్, ప్రయాణీకుల సౌలభ్యం, లగ్జరీ అనుభూతిని పెంచడంపై దృష్టి పెట్టింది. అయితే, దాని సేఫ్టీ, పనితీరు మాత్రం మునుపటిలాగే బలంగా ఉంది. ఈ కొత్త మార్పులతో, కర్వ్ మోడల్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మీడియం రేంజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో చాలా గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కొత్తగా అప్‌డేట్ చేయబడిన కర్వ్, కర్వ్ ఈవీ మోడళ్లలో సెగ్మెంట్‌లో మొదటిసారిగా అందించిన అనేక ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో R-Comfort సీట్లు (పాసివ్ వెంటిలేషన్‌తో - భారతదేశంలోనే మొదటిసారి) అందించారు. ఇది సుదీర్ఘ ప్రయాణాలలో కూడా సౌకర్యాన్ని ఇస్తుంది. వైట్ కార్బన్ ఫైబర్ స్టైల్ డాష్‌బోర్డ్, లెదర్ సీట్లతో కూడిన కొత్త ఇంటీరియర్ థీమ్, వెనుక ఆర్మ్‌రెస్ట్‌లో కప్ డాక్ వంటి మార్పులు లగ్జరీని పెంచాయి. కర్వ్ ఈవీలో వెనుక కూర్చునే ప్రయాణీకుల కోసం ప్యూర్ కంఫర్ట్ ఫుట్ రెస్ట్, ఎర్గోవింగ్ హెడ్‌రెస్ట్ వంటి ఫీచర్లు అందించారు. ఇది సాధారణంగా ఖరీదైన లగ్జరీ కార్లలో కనిపిస్తుంది.

ప్రైవసీ, వేడి నుంచి రక్షణ కోసం సెరనిటీ స్క్రీన్ సన్‌షేడ్స్‌ను కూడా జోడించారు. టాటా మోటార్స్ కర్వ్ ఎస్‌యూవీని పోటీ ధరల్లో లాంచ్ చేసింది. పెట్రోల్/డీజిల్ వేరియంంట్లు రూ.14.55 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. కర్వ్ ఈవీ వేరియంట్లు రూ.18.49 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. లగ్జరీతో పాటు, ఇందులో 12.3 అంగుళాల HARMAN టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 9-స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, జెశ్చర్-కంట్రోల్డ్ పవర్ టెయిల్‌గేట్, ట్విన్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో టాటా మోటార్స్ ఎక్కడా రాజీ పడలేదు. కర్వ్ మోడల్ 5-స్టార్ భారత్ NCAP సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఇందులో లెవెల్ 2 ADAS (Advanced Driver Assistance Systems) ఫీచర్‌ను కూడా అందించారు. దీంతో ఈ సెగ్మెంట్‌లోని సురక్షితమైన ఎస్‌యూవీలలో ఇది ఒకటిగా నిలిచింది.

Tags

Next Story