Tata Harrier : డీజిల్ బండ్లకు కాలం చెల్లిందా? టాటా పెట్రోల్ ఇంజిన్ పవర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.

Tata Harrier : డీజిల్ బండ్లకు కాలం చెల్లిందా? టాటా పెట్రోల్ ఇంజిన్ పవర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.
X

Tata Harrier : టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలైన సఫారీ, హారియర్లను సరికొత్త పెట్రోల్ వెర్షన్లతో మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. అయితే లాంచ్‌కు ముందే ఈ కార్లు సృష్టించిన రికార్డులు ఇప్పుడు ఆటోమొబైల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇండోర్‌లోని నాట్రాక్స్ (NATRAX) టెస్ట్ ట్రాక్‌పై నిర్వహించిన పరీక్షల్లో టాటా హారియర్ పెట్రోల్ ఏకంగా లీటరుకు 25.9 కిమీ మైలేజీని నమోదు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‎లో స్థానం సంపాదించుకుంది. అలాగే సఫారీ పెట్రోల్ మోడల్ గంటకు 216 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో దూసుకెళ్లి తన పవర్‌ను నిరూపించుకుంది.

టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన కొత్త 1.5 లీటర్ హీపారియన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇండోర్‌లో హైపర్ మైల్ టెస్ట్ నిర్వహించారు. దాదాపు 12 గంటల పాటు జరిగిన ఈ పరీక్షలో హారియర్ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన పెట్రోల్ ఎస్‌యూవీ విభాగంలో అత్యధిక మైలేజీ (25.9కిమీ) ఇచ్చిన కారుగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. సఫారీ పెట్రోల్ కూడా ఇదే ట్రాక్‌పై 25కిమీ మైలేజీని సాధించడం విశేషం.

మైలేజీతో పాటు వేగంలో కూడా ఈ ఇంజిన్ తగ్గేదేలే అంటోంది. టాటా సఫారీ పెట్రోల్ వెర్షన్ నాట్రాక్స్ ట్రాక్‌పై గంటకు 216 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. ఈ స్థాయి పర్ఫార్మెన్స్ లగ్జరీ కార్లలో మాత్రమే కనిపిస్తుంది. అయితే, ఈ మైలేజీ మరియు స్పీడ్ రికార్డులు ట్రాఫిక్ లేని, అనుకూలమైన పరిస్థితుల్లో సాధించినవని, నిజ జీవితంలో మైలేజీ రోడ్ల పరిస్థితిని బట్టి మారుతుందని కంపెనీ స్పష్టం చేసింది. సాధారణ రహదారులపై దీని మైలేజీ సుమారు లీటరుకు 12-15 కిమీ మధ్య ఉండవచ్చని అంచనా.

టాటా సఫారీ, హారియర్లలో వాడిన ఈ కొత్త 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ అడ్వాన్సుడ్ టెక్నాలజీతో తయారైంది. ఇది 170 PS పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అల్యూమినియం ఇంజిన్ బ్లాక్, హై-ప్రెజర్ డైరెక్ట్ ఇంజెక్షన్, వాటర్-కూల్డ్ టర్బోచార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వైబ్రేషన్లు తగ్గించి ఇంజిన్ శబ్దం క్యాబిన్ లోపలికి రాకుండా హైపర్ క్వైట్ టెక్నాలజీని వాడారు.

డీజిల్ వేరియంట్లతో పోలిస్తే పెట్రోల్ వెర్షన్ ధరలు సుమారు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. జనవరి 2026 మొదటి వారంలో వీటి ధరలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. మార్కెట్లో సఫారీ పెట్రోల్.. మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కజార్‌లకు గట్టి పోటీనివ్వనుంది. హారియర్ పెట్రోల్.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు సవాలు విసరనుంది.

Tags

Next Story