Tata Motors EV : టాటా ఈవీ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఏకంగా రూ.3.80 లక్షల వరకు ఆదా చేసే ఛాన్స్.

Tata Motors EV : భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, మార్చి 2026 నెలకు గానూ తన ఈవీ రేంజ్‌పై సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఫిబ్రవరిలో ఇచ్చిన ఆఫర్ల కంటే ఈసారి మరిన్ని ప్రయోజనాలను జోడించి కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా 2024 మరియు 2025లో తయారైన పాత స్టాక్ (MY24, MY25) మోడళ్లపై కంపెనీ భారీగా డిస్కౌంట్లు, బోనస్‌లను అందిస్తోంది. ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై వినియోగదారులు ఏకంగా రూ.3.80 లక్షల వరకు ఆదా చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది.
టాటా టియాగో ఈవీ
టాటా మోటార్స్ నుంచి అత్యంత ఆదరణ పొందిన టియాగో ఈవీపై ఈ మార్చిలో భారీ ఆఫర్లు ఉన్నాయి. సరికొత్త 2026 మోడల్ ఎక్స్ టీ వేరియంట్‌పై రూ.90,000 వరకు తగ్గింపు లభిస్తుండగా, హై-ఎండ్ వేరియంట్ అయిన ఎక్స్‌జెడ్ ప్లస్ పై రూ.1.20 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇక మీరు 2024 లేదా 2025 పాత స్టాక్ మోడళ్లను ఎంచుకుంటే, ఈ ఆఫర్ ఏకంగా రూ.2.10 లక్షల వరకు ఉంటుంది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్ కూడా కలిసి ఉన్నాయి.
టాటా పంచ్ ఈవీ
మైక్రో ఎస్‌యూవీ విభాగంలో దూసుకుపోతున్న పంచ్ ఈవీ ధరలను కూడా టాటా భారీగా తగ్గించింది. బేస్ వేరియంట్ అయిన స్మార్ట్‌పై రూ.90,000 వరకు, ఇతర వేరియంట్లపై రూ.1.20 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. లాంగ్ రేంజ్ వెర్షన్ కావాలనుకునే వారికి వేరియంట్‌ను బట్టి సుమారు రూ.1.40 లక్షల వరకు సేవింగ్స్ చేసుకునే వీలుంది. నగర ప్రయాణాలకు పంచ్ ఈవీ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
టాటా నెక్సాన్ ఈవీ
భారత ఈవీ మార్కెట్ రారాజు నెక్సాన్ ఈవీపై కూడా టాటా మోటార్స్ వరాల జల్లు కురిపించింది. 2024, 2025 మోడల్ నేక్సాన్ ఈవీ 3.0 కొనుగోలుపై అన్ని వేరియంట్ల మీద రూ.1.20 లక్షల వరకు ప్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. 2026 మోడళ్లపై మాత్రం రూ. 50,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, పాత టాటా కస్టమర్ల కోసం ప్రత్యేక లాయల్టీ ఇన్సెంటివ్స్ కూడా ఈ ఆఫర్లలో భాగంగా ఉన్నాయి.
టాటా కర్వ్, హారియర్ ఈవీ
ఇటీవలే లాంచ్ అయిన టాటా కర్వ్ ఈవీ పై ఈసారి అత్యధిక డిస్కౌంట్ ప్రకటించింది. క్రియేటివ్ 45 వేరియంట్ పాత స్టాక్ పై సుమారు రూ.3.80 లక్షల వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. ఇక కొత్త 2026 మోడళ్లపై కూడా రూ.2.80 లక్షల నుంచి రూ.3.30 లక్షల వరకు ఆదా చేయవచ్చు. వీటితో పాటు పెద్ద ఎస్‌యూవీ ప్రియుల కోసం హారియర్ ఈవీ అన్ని మోడళ్లపై రూ.1.50 లక్షల ప్లాట్ డిస్కౌంట్‌ను టాటా మోటార్స్ అందిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
