Tata Motors : టాటా నెక్సాన్, పంచ్ జోడీ అరాచకం.. భారత్ మార్కెట్‌లో సరికొత్త అమ్మకాల రికార్డు.

Tata Motors : టాటా నెక్సాన్, పంచ్ జోడీ అరాచకం.. భారత్ మార్కెట్‌లో సరికొత్త అమ్మకాల రికార్డు.
X

Tata Motors : టాటా మోటార్స్ నుండి వచ్చిన మొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన నెక్సాన్, 2017 సెప్టెంబర్ 21న మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ కారు ఇప్పుడు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, సిఎన్‌జి వంటి అన్ని రకాల ఇంజిన్లలో అందుబాటులో ఉంది. నెక్సాన్ భారత మార్కెట్లో ఏకంగా 9,10,181 యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. అంతేకాదు, దీని బ్రదర్ మోడల్ అయిన టాటా పంచ్ కూడా అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ రెండు కార్ల జోడీ భారత ఆటోమొబైల్ మార్కెట్లో నిజంగా పెను విధ్వంసం సృష్టించి, కొత్త రికార్డును నెలకొల్పాయి.

సెప్టెంబర్ 2025లో రికార్డు స్థాయి అమ్మకాలతో టాటా నెక్సాన్ దేశీయ మార్కెట్లో 9 లక్షల యూనిట్ల మైలురాయిని దాటింది. 2017 సెప్టెంబర్ 21న ప్రారంభమైన ఈ ఎస్‌యూవీ, టాటా మోటార్స్ నుండి 9 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించిన మొదటి ఎస్‌యూవీగా నిలిచింది. ఈ ఘనత లాంచ్ అయిన సరిగ్గా 8 సంవత్సరాల 1 నెల తర్వాత సాధించింది. నెక్సాన్, టాటా మోటార్స్‌ను ఎస్‌యూవీ, ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో తిరిగి పటిష్టం చేసిందని చెప్పవచ్చు. నెక్సాన్ తన మొదటి 2 లక్షల యూనిట్ల అమ్మకాలను జూన్ 2021లో పూర్తి చేసింది, అంటే లాంచ్ అయిన దాదాపు 45 నెలల తర్వాత. ఆ తర్వాత దాని వేగం బాగా పెరిగింది.

జత కలిసిన పంచ్ మరోవైపు, టాటా పంచ్ కూడా టాటా అమ్మకాలను పెంచడంలో సమానంగా సహకరిస్తోంది. పంచ్ మినీ ఎస్‌యూవీ ఒక సరసమైన మోడల్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లతో పాటు, పొడవైన హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ సెడాన్‌లు వంటి కార్లకు కూడా సవాలు విసిరేలా, ముఖ్యంగా విలువను కోరుకునే భారతీయ వినియోగదారుల కోసం రూపొందించబడింది. పంచ్ అతిపెద్ద బలం దాని అసలైన ఎస్‌యూవీ లాంటి ఫీచర్స్. ఇందులో ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ ఎత్తైన సీటింగ్ పొజిషన్, పొడవైన-ఎత్తైన డిజైన్ లభిస్తాయి.

నెక్సాన్ సెప్టెంబర్ 2025లో తన అత్యధిక నెలవారీ అమ్మకాలుగా 22,573 యూనిట్ల రికార్డును నెలకొల్పింది. ప్రస్తుతం, నెక్సాన్ ఆర్థిక సంవత్సరం 2026 మొదటి ఫస్ట్ హాఫ్ లో భారతదేశంలో నెంబర్ 1 ఎస్‌యూవీ గా నిలిచింది. ఇక దాని బ్రదర్ మోడల్ టాటా పంచ్ ఇప్పటివరకు 6,26,000 యూనిట్లు అమ్ముడైంది. ఇది గత సంవత్సరం అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది. మరోసారి దాని అమ్మకాలు పెరుగుతున్నాయి. టాటా మోటార్స్ ఈ వ్యూహం పూర్తిగా విజయవంతమైందని స్పష్టమవుతోంది

Tags

Next Story