Tata Nexon : టాటా నెక్సాన్ డబుల్ ధమాకా.. లెవెల్ 2 ADAS తో పాటు కొత్త రెడ్ డార్క్ ఎడిషన్ లాంచ్!

Tata Nexon : టాటా నెక్సాన్ డబుల్ ధమాకా.. లెవెల్ 2 ADAS తో పాటు కొత్త రెడ్ డార్క్ ఎడిషన్ లాంచ్!
X

Tata Nexon : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీలలో ఒకటి, సేఫ్టీకి మారుపేరుగా నిలిచిన టాటా నెక్సాన్ ఇప్పుడు మరింత అడ్వాన్సుడ్‎గా మారింది. భారతదేశ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ తాజాగా నెక్సాన్‌లో లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్‌ను చేర్చింది. అంతేకాకుండా, వినియోగదారుల కోసం సరికొత్త, స్టైలిష్ రెడ్ డార్క్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది. సేఫ్టీ, టెక్నాలజీ, స్టైల్ కలగలిసిన ఈ కొత్త నెక్సాన్, భారతీయ రోడ్లపై మరోసారి తన ప్రభావాన్ని చూపడానికి రెడీగా ఉంది.

టాటా నెక్సాన్ ఎస్‌యూవీ మొదటి నుండి సేఫ్టీకి ప్రసిద్ధి చెందింది. దేశంలోనే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మొదటి ఎస్‌యూవీగా ఇది రికార్డు సృష్టించింది. ఇప్పుడు నెక్సాన్ మరింత అరుదైన ఘనతను సాధించింది. గ్లోబల్ ఎన్‌క్యాప్, భారత్ ఎన్‌క్యాప్ రెండింటి నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన ఏకైక ఎస్‌యూవీగా నిలిచింది. ఈ కొత్త ADAS టెక్నాలజీతో నెక్సాన్ సేఫ్టీ విషయంలో గతంలో కంటే చాలా మెరుగైంది.

నెక్సాన్‌లో జోడించిన ADAS ఫీచర్ల ద్వారా డ్రైవర్‌కు రోడ్డుపై మరింత కంట్రోల్, సేఫ్టీ లభిస్తుంది. ముఖ్యంగా హైవే డ్రైవింగ్, సిటీ ట్రాఫిక్‌లో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఫీచర్లలో భాగంగా కారులో అనేక స్మార్ట్ సిస్టమ్‌లు పనిచేస్తాయి. ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ సెప్టెంబర్ 2025లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి, కంపెనీకి మరో పెద్ద విజయాన్ని అందించింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని, కంపెనీ స్టైలిష్‌గా ఉండే నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ఆకర్షణీయమైన డిజైన్, లగ్జరీ ఇంటీరియర్‌లు ప్రత్యేకంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కొత్త రెడ్ డార్క్ ఎడిషన్ కారు లోపల, వెలుపల అనేక స్పెషల్ ఫీచర్లను కలిగి ఉంది. కారు లోపల అంతా రెడ్-డార్క్ థీమ్‌తో డిజైన్ చేయబడింది. ఎరుపు రంగు లెదర్ సీట్లు, వేసవిలో సౌకర్యంగా ఉండే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుక సీట్ల ప్రయాణికుల కోసం రియర్ సన్‌షేడ్ ఇందులో ఉన్నాయి. 26.03 సెంటీమీటర్ల హార్మన్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ కనెక్టివిటీ, ఇతర ప్రీమియం ఫీచర్లు ఈ ఎడిషన్‌కు లగ్జరీ లుక్‌ను తీసుకొచ్చాయి.

కొత్త నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.12.44 లక్షలు (ఎక్స్-షోరూమ్). ADAS ఫీచర్ కూడా సెలక్ట్ చేసిన వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్ రూ.12.44 లక్షలు, డీజిల్ మ్యాన్యువల్ రూ.13.52 లక్షలు, డీజిల్ ఏఎమ్‌టి రూ.14.15 లక్షలు. ADAS తో కూడిన పెట్రోల్ డీసీఏ వేరియంట్ ధర రూ.13.81 లక్షలు. నెక్సాన్ ఫియర్‌లెస్+ పీఎస్ డీసీఏ ఏడిఏఎస్‌ వేరియంట్ ధర రూ.13.53 లక్షలు. సేఫ్టీ, టెక్నాలజీ, స్టైల్ అద్భుతమైన కలయికతో కొత్త నెక్సాన్ భారతీయ కస్టమర్ల మధ్య మరోసారి భారీ విజయం సాధిస్తుందని కంపెనీ నమ్మకంగా ఉంది.

Tags

Next Story