Tata Punch : అదిగదిగో టాటా పంచ్..టర్బో ఇంజిన్, అదిరిపోయే లుక్..ఇక ఎక్స్టర్ పని ఖల్లాస్?

Tata Punch : అదిగదిగో టాటా పంచ్..టర్బో ఇంజిన్, అదిరిపోయే లుక్..ఇక ఎక్స్టర్ పని ఖల్లాస్?
X

Tata Punch : టాటా మోటార్స్ తన మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ టాటా పంచ్‌ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. జనవరి 13న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ కానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో టీజర్ల ద్వారా హల్చల్ చేస్తున్న ఈ కారులో కేవలం లుక్ మాత్రమే కాదు, ఇంజిన్ పరంగా కూడా భారీ మార్పులు జరగబోతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే.. ఇది మినీ ఎస్‌యూవీ మార్కెట్లో మళ్లీ ప్రకంపనలు సృష్టించడం ఖాయం.

కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ చూడటానికి అచ్చం పంచ్ ఈవీ లాగే ఉండబోతోంది. ముందు భాగంలో సన్నని రేడియేటర్ గ్రిల్, కొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, వర్టికల్ స్టైల్ హెడ్‌ల్యాంప్‌లతో కారు చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో 16 ఇంచుల కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ రాబోతున్నాయి. వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, స్మోక్డ్ ఎఫెక్ట్ ఫినిషింగ్‌తో కారు ప్రీమియం లుక్‌ను సంతరించుకుంది. ముఖ్యంగా ఇందులో కొత్త బ్లూ కలర్ ఆప్షన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఫీచర్ల విషయంలో టాటా ఈసారి అస్సలు తగ్గలేదు. ఈ కారులో మొట్టమొదటిసారిగా 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ రాబోతోంది. లోపల ఇంటీరియర్ లేఅవుట్ కూడా పూర్తిగా మారిపోయింది. కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండబోతున్నాయి. అంతేకాకుండా గ్యాడ్జెట్స్ వేగంగా ఛార్జ్ చేసుకోవడానికి 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఇందులో కొత్తగా చేర్చారు.

భారతదేశంలో అత్యంత సురక్షితమైన కార్లలో టాటా పంచ్ ఒకటి. ఇప్పటికే గ్లోబల్ NCAP, భారత్ NCAPలలో 5-స్టార్ రేటింగ్ సాధించిన ఈ కారు, ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. రోడ్డు మీద ప్రయాణం ఇప్పుడు మరింత భద్రంగా ఉండబోతోంది.

పంచ్ ప్రియులకు అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే.. ఇందులో కొత్తగా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ రాబోతోంది. ఇది 118 bhp పవర్, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కారు పికప్, వేగం అదిరిపోతాయి. టర్బో ఇంజిన్ ఉన్న కార్ల వెనుక iTurbo బ్యాడ్జింగ్ ఉంటుంది. పెట్రోల్, టర్బో వెర్షన్లతో పాటు సిఎన్‌జి, ఈవీ మోడల్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. జనవరి 13న దీని ధరలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Tags

Next Story