Tata Punch : టాటా పంచ్ కొత్త అవతారం..ఎక్స్‌టర్‌కు ఇక చుక్కలే..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Tata Punch : భారతీయ రోడ్లపై సంచలనం సృష్టిస్తున్న టాటా పంచ్ ఇప్పుడు మరింత స్టైలిష్‌గా మారిపోతోంది. 2026 ప్రారంభంలోనే టాటా మోటార్స్ తన కస్టమర్లకు ఈ స్వీట్ సర్ప్రైజ్ ఇస్తోంది. పాత మోడల్ కంటే ఈ కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ చాలా షార్ప్‌గా, ప్రీమియం లుక్‌తో రాబోతోంది. ముఖ్యంగా టాటా నెక్షన్, హారియర్ వంటి పెద్ద కార్లలో ఉండే డిజైన్ ఎలిమెంట్స్‌ను ఇప్పుడు పంచ్‌లో కూడా చూడవచ్చు. మార్కెట్లో గట్టి పోటీ ఉన్న సబ్-4 మీటర్ సెగ్మెంట్‌లో తన పట్టును నిరూపించుకోవడానికి టాటా అన్ని అస్త్రాలను సిద్ధం చేసింది.
ఈ కారు ఫ్రంట్ ఫేసియాను పూర్తిగా మార్చేశారు. కొత్త ఎల్‌ఈడీ డీఆర్ఎల్లు, రీ-డిజైన్ చేసిన హెడ్ లైట్లు కారుకు స్పోర్టీ లుక్ ఇస్తున్నాయి. వెనుక వైపున కొత్త షేప్‌లో ఉండే బంపర్, ఆకట్టుకునే టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇక లోపలికి వెళ్తే.. వెలిగిపోయే టాటా లోగోతో కూడిన సరికొత్త స్టీరింగ్ వీల్ మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఏసీ వెంట్లను స్టైలిష్‌గా మార్చడంతో పాటు, 7-ఇంచుల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉన్న ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇందులో ఏర్పాటు చేశారు.
మారుతున్న కాలానికి తగ్గట్టుగా టాటా పంచ్‌లో ఇప్పుడు 360-డిగ్రీ కెమెరా సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల కారును పార్కింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. భద్రత విషయంలో టాటా ఎప్పుడూ కాంప్రమైజ్ కాదు కాబట్టి, ఇందులో 6 ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్ ఫీచర్‌గా ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కస్టమర్లకు మంచి ఎంటర్టైన్‌మెంట్ అందిస్తుంది. రంగుల విషయంలో కూడా టాటా కొత్తదనం చూపింది.. బెంగాల్ రూజ్ రెడ్, క్యారామెల్ ఎల్లో వంటి సరికొత్త కలర్ ఆప్షన్లలో ఈ కారు లభిస్తుంది.
ఈసారి కేవలం లుక్ మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోనుంది. ఇప్పటివరకు ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో పాటు, కొత్తగా 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా టాటా జోడించింది. దీనివల్ల కారుకు అదనపు పవర్ లభిస్తుంది. ముఖ్యంగా హైవేలపై లాంగ్ డ్రైవ్‌లు వెళ్లే వారికి, వేగంగా దూసుకుపోవాలనుకునే వారికి ఈ టర్బో ఇంజిన్ ఒక వరమని చెప్పవచ్చు. డ్రైవింగ్ డైనమిక్స్‌లో వచ్చిన ఈ మార్పు పంచ్‌ను తన ప్రత్యర్థి హ్యుందాయ్ ఎక్స్‌టర్ కంటే ఒక అడుగు ముందు ఉంచుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

