Tata Punch Facelift : కొత్తగా ముస్తాబై వస్తున్న రాబోతున్న టాటా పంచ్..టెస్టింగ్ షురూ.

Tata Punch Facelift : కొత్తగా ముస్తాబై వస్తున్న రాబోతున్న టాటా పంచ్..టెస్టింగ్ షురూ.
X

Tata Punch Facelift : భారతీయ మార్కెట్‌లో బాగా పాపులారిటీ పొందిన టాటా పంచ్ మైక్రో-ఎస్‌యూవీ త్వరలో కొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో రాబోతోంది. ఇది 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత కొద్ది నెలలుగా ఈ కారు టెస్టింగ్ జరుగుతోంది. ఇటీవల మళ్లీ కామోఫ్లాజ్‌లో (కారును కప్పి ఉంచడం) ఈ కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను స్పాట్ చేశారు. కొత్త మోడల్ డిజైన్, ఫీచర్ల విషయంలో చాలా అప్‌గ్రేడ్ అవుతుందని ఈ స్పై షాట్‌లు స్పష్టం చేస్తున్నాయి. పంచ్ ఈవీ తరహా హై-టెక్ అంశాలను జోడించి, దీన్ని మరింత మోడర్న్‌గా తీర్చిదిద్దుతున్నారు.

కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో అత్యంత పెద్ద మార్పు ముందు భాగంలో కనిపిస్తోంది. కొత్త పంచ్‌కు ఈవీ తరహా హై-టెక్ లైటింగ్ సెటప్ ఇచ్చారు. దీనివల్ల కారు మరింత ప్రీమియంగా కనిపిస్తోంది. పైన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, కింద హారిజాంటల్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఈ డిజైన్ పంచ్ ఈవీని పోలి ఉంది. కొత్త స్లేటెడ్ గ్రిల్, రెక్టాంగులర్ లోయర్ గ్రిల్ కారు లుక్‌ను మరింత ధృఢంగా మారుస్తున్నాయి. సైడ్ డిజైన్ దాదాపు అలాగే ఉన్నా, కొత్త అల్లాయ్ వీల్స్ వచ్చే అవకాశం ఉంది. వెనుక వైపు వాలుగా ఉన్న విండ్‌స్క్రీన్, కొత్త బూట్, మారిన బంపర్ వల్ల కారు చాలా కొత్తగా కనిపిస్తుంది.

కారు లోపల కూడా చాలా మార్పులు చేశారు, ముఖ్యంగా కొత్త ఫీచర్లు కారును మరింత ప్రీమియంగా మారుస్తాయి. 2-స్పోక్ స్టీరింగ్ వీల్ అనేది ఇప్పుడు టాటా కొత్త ఎస్‌యూవీల ప్రత్యేకతగా మారింది. ఇది పంచ్‌లో కూడా రాబోతోంది. 7-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, బ్లైండ్-స్పాట్ మానిటర్, ముందు వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు కూడా అదనంగా వచ్చే అవకాశం ఉంది.

సేఫ్టీ విషయంలో పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా లభించవచ్చని అంచనా. స్పై షాట్‌ల ఆధారంగా కొత్త పంచ్‌లో 360-డిగ్రీ కెమెరా కూడా ఉండవచ్చు. ఈ సెగ్మెంట్‌లో ఇది చాలా ప్రీమియం ఫీచర్గా పరిగణిస్తున్నారు. పంచ్‌ను పోటీ కార్ల కంటే ఒక అడుగు ముందుకు ఉంచుతుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్ వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు యధావిధిగా కొనసాగుతాయి.

పవర్ట్రైన్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కొత్త పంచ్‌లో ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ రేవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ (87.8 bhp) ఉంటుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ ఆప్షన్లు ఉంటాయి. సీఎన్‌జీ వేరియంట్ కూడా యధావిధిగా కొనసాగుతుంది. మొత్తంగా కొత్త పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్, ఫీచర్లు, సేఫ్టీలో పెద్ద అప్‌గ్రేడ్‌ను తీసుకురాబోతోంది.

Tags

Next Story