Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ వచ్చేస్తోంది.. ఆ రేంజ్ ఏంది సామీ.. ఒక్క ఛార్జ్‌తో 500 కిలోమీటర్లు.

Tata Sierra EV : టాటా మోటార్స్ ఐకానిక్ బ్రాండ్ టాటా సియెర్రా మళ్లీ మన ముందుకు వచ్చేస్తోంది. అయితే ఈసారి సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో మెరిసిపోయేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పెట్రోల్/డీజిల్ వెర్షన్ సియెర్రా లాంచ్ అయి దుమ్మురేపుతుండగా, ఇప్పుడు సియెర్రా ఈవీ కూడా మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ 2026 మధ్యలో ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేయనున్నట్లు టాటా మోటార్స్ అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం రోడ్లపై టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు ఫైనల్ డిజైన్ పనులను కంపెనీ వేగవంతం చేస్తోంది.
ఈ కారు రేంజ్, ఫీచర్ల విషయానికొస్తే..ఇది కేవలం ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని సమాచారం. దీనికోసం టాటా మోటార్స్ ఇందులో 55kWh, 65kWh సామర్థ్యం గల రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇందులో వెహికల్-టు-లోడ్ (V2L), బై-డైరెక్షనల్ ఛార్జింగ్ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కూడా ఉండబోతోంది. అంటే మీ కారు బ్యాటరీతో ఇతర ఎలక్ట్రిక్ పరికరాలను కూడా నడుపుకోవచ్చు. ఇది సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ (ఆల్-వీల్ డ్రైవ్) వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
డిజైన్ పరంగా సియెర్రా ఈవీ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే చాలా మోడ్రన్‌గా ఉండబోతోంది. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, కారు మొత్తం వెడల్పుగా ఉండే ఎల్ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు, స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్ దీనికి రాజసం తెచ్చిపెడతాయి. కారు వెనుక భాగంలో కూడా కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్ ఉండబోతోంది. ఇక ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, మసుక్యులర్ వీల్ ఆర్చెస్, స్టైలిష్ అలాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి అదిరిపోయే రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తాయి. లోపల కేబిన్ కూడా చాలా ప్రీమియంగా ఉండబోతోంది.
ధర విషయానికొస్తే, ఇది టాటా కర్వ్ ఈవీ కంటే ఖరీదైనదిగా ఉండనుంది. ఇది ముఖ్యంగా మిడ్ సైజ్ ఎస్‌యూవీలను ఇష్టపడే, లగ్జరీ, లాంగ్ రేంజ్ కోరుకునే కస్టమర్లను టార్గెట్ చేస్తోంది. టాటా సొంత Acti.ev+ ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారవుతున్న ఈ కారు, హారియర్ ఈవీలోని కొన్ని కీలక విడిభాగాలను కూడా పంచుకోనుంది. మొత్తానికి 90వ దశకంలో యువత మనసు దోచుకున్న సియెర్రా, ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
