Tata Sierra EV : లెజెండ్ ఈజ్ బ్యాక్.. 600 కిమీ రేంజ్‌తో టాటా సియెర్రా ఈవీ సంచలనం.. ప్రత్యర్థులకు చుక్కలే.

Tata Sierra EV : లెజెండ్ ఈజ్ బ్యాక్.. 600 కిమీ రేంజ్‌తో టాటా సియెర్రా ఈవీ సంచలనం.. ప్రత్యర్థులకు చుక్కలే.
X

Tata Sierra EV : 90వ దశకంలో ఇండియన్ రోడ్లపై ఒక ఊపు ఊపిన లెజెండరీ కారు టాటా సియెర్రా ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలోకి మారిపోయింది. 2025లో ఈ ఎస్‌యూవీ పెట్రోల్/డీజిల్ వెర్షన్ లాంచ్ అయిన కేవలం 24 గంటల్లోనే 70,000 బుకింగ్స్ సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అదే జోష్‌ను ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా కొనసాగించడానికి టాటా మోటార్స్ సియెర్రా ఈవీని సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ కారు రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరా కంటికి చిక్కింది.

ఈ సరికొత్త సియెర్రా ఈవీ చూడటానికి పాత సియెర్రా లుక్‌ను గుర్తు చేస్తూనే, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో రాబోతోంది. ఎలక్ట్రిక్ కారు కాబట్టి దీనికి ముందు వైపు గ్రిల్ ఉండదు, బదులుగా క్లోజ్డ్ ప్యానెల్ ఉంటుంది. మంచి మైలేజీ కోసం గాలిని సులువుగా చీల్చుకుపోయేలా ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. లోపల క్యాబిన్ విషయానికొస్తే.. డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ (IRVM), అదిరిపోయే సౌండ్ సిస్టమ్, వినోదం కోసం Arcade.ev అనే యాప్ సూట్‌ను కూడా టాటా అందిస్తోంది.

బ్యాటరీ, పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో రెండు రకాల ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఒకటి 65 kWh, మరొకటి 75 kWh బ్యాటరీ ప్యాక్. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా. టాటా హారియర్ ఈవీ నుంచి తీసుకున్న ఈ టెక్నాలజీతో, ఇది టూ-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లలో లభించనుంది. అంటే సిటీ రోడ్ల మీద మాత్రమే కాదు, ఆఫ్‌రోడింగ్‌లో కూడా ఈ కారు దుమ్ములేపడం ఖాయం.

ఈ కారును టాటా మోటార్స్ తమ సరికొత్త acti.ev ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తోంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ కార్ల కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన టెక్నాలజీ. దీని వల్ల కారు లోపల ఎక్కువ స్థలం ఉండటమే కాకుండా, 5G కనెక్టివిటీ, లెవల్ 2 ADAS (ఆటోమేటిక్ సేఫ్టీ ఫీచర్స్), ఒక కారు నుంచి మరో కారుకు ఛార్జింగ్ ఇచ్చుకునే (V2V) సదుపాయం కూడా ఉంటుంది. మొత్తానికి పాత జ్ఞాపకాలను, కొత్త టెక్నాలజీని కలిపి టాటా మోటార్స్ ఒక గట్టి బాంబును మార్కెట్లోకి వదలబోతోంది.

Tags

Next Story