Tata Sierra : చరిత్ర సృష్టించిన టాటా ఐకానిక్ ఎస్యూవీ.. ఒకే నెలలో 7 వేల కార్లు అమ్మి టాప్ 10లోకి ఎంట్రీ.

Tata Sierra : టాటా మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐకానిక్ బ్రాండ్ సౌండ్ ఇప్పుడు ఇండియన్ రోడ్లపై గట్టిగా వినిపిస్తోంది. కొత్తగా విడుదలైన టాటా సియెర్రా ఎస్‌యూవీ అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. కేవలం ఒకే నెలలో టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీల జాబితాలోకి చేరి ప్రత్యర్థి కంపెనీలకు నిద్రలేకుండా చేస్తోంది. టాటా సియెర్రా రీ-ఎంట్రీ అదిరిపోయింది. గతేడాది డిసెంబర్ 15న డెలివరీలు ప్రారంభమైన ఈ కారు, జనవరి నెలలోనే ఏకంగా 7,003 యూనిట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించింది. కేవలం ఒకే నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల జాబితాలో 6వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మారుతి గ్రాండ్ విటారా (7,030 యూనిట్లు) కంటే కేవలం కొన్ని కార్ల దూరంలో నిలిచిన సియెర్రా.. హోండా ఎలివేట్, టాటా కర్వ్, స్కోడా కుషాక్ వంటి దిగ్గజ కార్లను వెనక్కి నెట్టేసింది.
ప్రస్తుతం ఎస్‌యూవీ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా మొదటి స్థానంలో ఉండగా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి కార్లకు సియెర్రా గట్టి సవాలు విసురుతోంది. దీని రెట్రో-స్టైల్ డిజైన్, మోడ్రన్ ఫీచర్లు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రూ.11.49 లక్షల ప్రారంభ ధరతో 7 వేరియంట్లలో లభిస్తుండటంతో మిడ్-రేంజ్ ఎస్‌యూవీ ప్రియులకు ఇది హాట్ ఫేవరెట్‌గా మారింది.
టాటా సియెర్రా కేవలం అమ్మకాల్లోనే కాదు, ఫీచర్ల విషయంలోనూ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఇందులో మునుపెన్నడూ లేని విధంగా 12.3 అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం ప్రత్యేకంగా 10.25 అంగుళాల డిజిటల్ డిస్ప్లే ఉంది. ఇంకా వింత ఏంటంటే.. పక్కన కూర్చున్న ప్యాసింజర్ కోసం కూడా విడిగా మరో 12.3 అంగుళాల స్క్రీన్‌ను కేటాయించారు. లోపల కూర్చుంటే ఒక లగ్జరీ కారులో ఉన్న అనుభూతి కలుగుతుంది.
భద్రత విషయంలో టాటా ఎప్పుడూ ముందే ఉంటుంది. సియెర్రాలో లెవెల్-2 ADAS టెక్నాలజీని అందించారు. దీనితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ల JBL సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. పాత కాలపు సియెర్రా డిజైన్‌ను గుర్తు చేస్తూనే, సరికొత్త టెక్నాలజీతో వచ్చిన ఈ ఎస్‌యూవీ ఫ్యామిలీస్, యువతను సమానంగా మెప్పిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
