Tata Sierra : బేస్ మోడల్ vs సెకండ్ బేస్ మోడల్ .. టాటా సియెరాకు రూ.1.72 లక్షలు ఎక్కువ పెడితే లాభమా?

Tata Sierra : టాటా మోటార్స్ ఇటీవల మార్కెట్‌లో విడుదల చేసిన సియెరా ఎస్యూవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో ప్రజల మాటల్లో అంతటా ఈ సరికొత్త ఎస్‌యూవీ గురించే చర్చ జరుగుతోంది. టాటా సియెరా ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది స్మార్ట్+, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ అనే ఏడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
సియెరా బేస్ మోడల్ అయిన స్మార్ట్+ తో పోలిస్తే, దాని తరువాతి వేరియంట్ అయిన ప్యూర్ ధర ఆన్-రోడ్‌లో దాదాపు రూ.1.72 లక్షలు ఎక్కువ. ఉదాహరణకు స్మార్ట్+ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ.13.45 లక్షలు కాగా, ప్యూర్ వేరియంట్ ధర రూ.15.17 లక్షల వరకు ఉంది. అయితే, ఈ రెండు వేరియంట్‌లలో ఏ ఫీచర్లు లభిస్తాయి. రూ.1.72 లక్షలు ఎక్కువ చెల్లించడం తెలివైన ఎంపిక అవుతుందా అనేది చాలా మంది కొనుగోలుదారులలో ఉన్న ప్రశ్న.
టాటా సియెరా అన్ని వేరియంట్‌లలో కూడా అద్భుతమైన స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. దీని ద్వారా బేస్ మోడల్‌లో కూడా సేఫ్టీ, సౌకర్యానికి పూర్తిగా ప్రాధాన్యత ఇచ్చారని అర్థమవుతుంది. అన్ని వేరియంట్లలో లభించే ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), అన్ని చక్రాలలో డిస్క్ బ్రేక్స్, ఆటో-హోల్డ్ తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ABS/EBD ఉన్నాయి. రియర్ ఏసీ వెంట్స్, రియర్ సన్‌షేడ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, కెమెరా, డ్రైవ్ మోడ్‌లు (సిటీ/స్పోర్ట్) వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు కూడా అన్ని మోడళ్లలో ఉన్నాయి.
సియెరా బేస్ మోడల్ అయిన స్మార్ట్+ లో కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి. అవి స్టైలిష్ లైట్ సేబర్ LED DRLs (డే-టైమ్ రన్నింగ్ లైట్స్), కీ అవసరం లేకుండా బండిని స్టార్ట్/ఆఫ్ చేయడానికి పుష్ స్టార్ట్-స్టాప్ బటన్, వెనుక కూర్చునే వారికి రియర్ ఏసీ వెంట్స్, 17-అంగుళాల స్టీల్ వీల్స్, ఎలక్ట్రిక్ ORVMs, బాడీలో కలిసిపోయే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ మరియు వెల్‌కమ్ లైట్స్, బటన్‌తో తెరుచుకుని, మూసుకునే పవర్‌డ్ టెయిల్‌గేట్ ఉన్నాయి.
ప్యూర్ వేరియంట్‌లో రూ.1.72 లక్షలు అదనంగా చెల్లిస్తే, మీకు కొన్ని అద్భుతమైన ఫీచర్లు లభిస్తాయి. అవి 17-అంగుళాల స్టైలిష్ అల్లాయ్ వీల్స్, ముందు, వెనుక సీట్ల వరకు విస్తరించి ఉండే పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, వాలుగా ఉన్న ప్రదేశంలో కారును నెమ్మదిగా ఉంచే హిల్ డిసెంట్ కంట్రోల్, ముందు రెండు సీట్లకు వేర్వేరు ఉష్ణోగ్రతలను సెట్ చేసుకునే సౌకర్యం ఉన్న డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కేబుల్ లేకుండా మొబైల్‌ను కనెక్ట్ చేసే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వస్తాయి.
రూ.1.72 లక్షలు ఎక్కువ పెట్టడం తెలివైనదేనా ? అన్న ప్రశ్నకు అవును అనే సమాధానం చెప్పాలి. ప్యూర్ వేరియంట్‌లో లభించే ఫీచర్లు అద్భుతమైనవి. ముఖ్యంగా కంపెనీ ద్వారా ఇన్‌స్టాల్ చేయబడిన ఫీచర్లు ఎల్లప్పుడూ మంచి క్వాలిటీని కలిగి ఉంటాయి. కంపెనీ నుంచి ఫిట్ చేయబడిన సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ లేదా పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు మెరుగైన సేఫ్టీ, ఫిట్టింగ్, వైరింగ్, ఇంటిగ్రేషన్, వారంటీ ని అందిస్తాయి. ఈ ఫీచర్లలో చాలా వరకు బయట చేయించుకోవడానికి ప్రయత్నించినా, అవి క్వాలిటీ, సాఫ్ట్‌వేర్ అనుకూలత, వారంటీ పరంగా చాలా సమస్యలను సృష్టించవచ్చు. కాబట్టి డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కావాలనుకుంటే, రూ.1.72 లక్షలు ఎక్కువ చెల్లించి ప్యూర్ వేరియంట్‌ను కొనుగోలు చేయడం ఒక స్మార్ట్ ఆప్షన్ అవుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

