Cheapest Electric Car : పెట్రోల్ తిప్పలు ఇక చాలు.. దేశంలోనే చౌకైన ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇవే.

Cheapest Electric Car : పెట్రోల్ తిప్పలు ఇక చాలు.. దేశంలోనే చౌకైన ఎలక్ట్రిక్ కార్ల వివరాలు ఇవే.
X

Cheapest Electric Car : పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్న వేళ, మధ్యతరగతి సామాన్యుడి చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మళ్లుతోంది. ఒకప్పుడు ఈవీలు అంటే భారీ ధరలు ఉండేవని అనుకునేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 2026లో మార్కెట్లో బడ్జెట్ ధరలో అదిరిపోయే రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో టాటా, ఎంజీ కంపెనీలు సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకే ఈవీలను అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. భారతదేశంలో 5-సీటర్ విభాగంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా టాటా టాయాగో ఈవీ నిలిచింది. దీని ప్రారంభ ధర సుమారు రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఒకవేళ మీకు కేవలం నలుగురు కూర్చునే కారు సరిపోతుందనుకుంటే, ఎంజీ కామెట్ ఈవీ సుమారు రూ.7.50 లక్షలకే అందుబాటులో ఉంది. అయితే ఫ్యామిలీతో కలిసి ప్రయాణించేందుకు, లగేజీ పెట్టుకోవడానికి టాయాగో ఈవీనే బెస్ట్ ఆప్షన్ అని కస్టమర్లు భావిస్తున్నారు. ఈ కారు మొత్తం 6 రంగుల్లో మరియు 6 వేరియంట్లలో లభిస్తోంది.

టాటా టాయాగో ఈవీలో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 19.2 kWh బ్యాటరీ ప్యాక్, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 223 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. నగరాల్లో తిరిగే వారికి ఇది సరిపోతుంది. ఇక లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడే వారి కోసం 24 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది, ఇది ఏకంగా 293 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.7 సెకన్లలోనే అందుకుంటుంది. అంటే దీని పికప్ పెట్రోల్ కార్ల కంటే ఏమాత్రం తక్కువ కాదు.

ఇక ఈ కారులో ఫీచర్ల విషయానికి వస్తే.. క్రూయిజ్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ కారులో ఛార్జింగ్ కూడా చాలా ఈజీ. డిసి ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 58 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీరు రోజుకు 50 కిలోమీటర్లు తిరిగినా, నెలకు పెట్రోల్ ఖర్చులో వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు సిటీ రైడ్స్ కోసం చాలా మంది ఈ బడ్జెట్ ఈవీ వైపు మొగ్గు చూపుతున్నారు.

Tags

Next Story