Budget Sedan : ఈ రేంజ్‌లో ఇలాంటి కారు దొరకదు..రూ.5.49 లక్షలకే 4 స్టార్ సేఫ్టీ సెడాన్..28కిమీ మైలేజ్ మీ సొంతం.

Budget Sedan : ఈ రేంజ్‌లో ఇలాంటి కారు దొరకదు..రూ.5.49 లక్షలకే 4 స్టార్ సేఫ్టీ సెడాన్..28కిమీ మైలేజ్ మీ సొంతం.
X

Budget Sedan : తక్కువ బడ్జెట్‌లో మంచి సేఫ్టీ, అద్భుతమైన మైలేజ్ ఉన్న సెడాన్ కారు కొనాలని చూస్తున్న వారికి టాటా మోటార్స్ పాపులర్ సెడాన్ టాటా టిగోర్ సరైన ఎంపిక. టాటా కంపెనీ నుంచి వస్తున్న ఏకైక సెడాన్ మోడల్ ఇదే. దీని 2025 మోడల్ మంచి మైలేజ్, సరికొత్త ఫీచర్లు, గట్టి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఈ కారు సేఫ్టీ విషయంలో గ్లోబల్ NCAP నుంచి ఏకంగా 4 స్టార్ రేటింగ్ అందుకుంది. ఇది మార్కెట్‌లో మారుతి డిజైర్, హోండా అమేజ్ వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇస్తోంది.

టాటా టిగోర్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర కేవలం రూ.5,48,990 నుంచి మొదలవుతుంది. ఇది కారు బేస్ వేరియంట్ ధర కాగా, టాప్ వేరియంట్ ధర రూ.7,82,190 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇక అత్యధిక మైలేజీని ఆశించే వారి కోసం టిగోర్ సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.8.69 లక్షల నుంచి రూ.8.74 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. మైలేజీ విషయానికి వస్తే పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 19.28 కి.మీ వరకు, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ 19.6 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది. అయితే, CNG ఆటోమేటిక్ వేరియంట్ లీటర్‌కు 28.06 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది.

టిగోర్ కేవలం ధర, మైలేజీలోనే కాక, సేఫ్టీ, ఫీచర్లలో కూడా బాగా ఆకట్టుకుంటుంది. Global NCAP క్రాష్ టెస్ట్‌లో 2020లో విడుదలైన ICE (పెట్రోల్/డీజిల్) మోడల్‌కు అడల్ట్ సేఫ్టీలో 4 స్టార్, చైల్డ్ సేఫ్టీలో 3 స్టార్ రేటింగ్ లభించింది. 2021లో పరీక్షించిన ఈవీ మోడల్ అయితే అడల్ట్, చైల్డ్ సేఫ్టీ రెండింటిలోనూ 4 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ బడ్జెట్ సెడాన్ కొనుగోలుదారులలో భద్రత పట్ల నమ్మకాన్ని పెంచుతుంది.

కారులోని ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8 స్పీకర్లతో కూడిన హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ వంటివి ఉన్నాయి. సౌకర్యాల కోసం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఈ సెడాన్ అతిపెద్ద ఆకర్షణ దాని 419 లీటర్ల భారీ బూట్ స్పేస్. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లే లాంగ్ జర్నీలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. భద్రత కోసం ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ , HD రివర్స్ పార్కింగ్ డిజిటల్ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Tags

Next Story