Tata Motors : మార్కెట్లో టాటా మోటార్స్ అసలైన జాతర..ఈ 4 కొత్త కార్లు వస్తే ఇక ప్రత్యర్థులకు వణుకే.

Tata Motors : టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలైన హారియర్, సఫారీలను సరికొత్త పెట్రోల్ వెర్షన్లలో తీసుకురాబోతోంది. నిజానికి ఇవి డిసెంబర్ 9నే లాంచ్ కావాల్సి ఉన్నా, చిన్న చిన్న కారణాల వల్ల వాయిదా పడ్డాయి. వచ్చే కొన్ని వారాల్లోనే ఇవి మార్కెట్లోకి వస్తాయని అంచనా. ఈ కార్లలో సరికొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను టాటా వాడుతోంది. ఇది ఏకంగా 170 పీఎస్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కేవలం పవర్ మాత్రమే కాదు, ఈ ఇంజిన్ ఎకో-ఫ్రెండ్లీ (E20 ఇథనాల్) ఇంధనంతో కూడా నడుస్తుంది. మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో రాబోతున్న ఈ కార్లు డీజిల్ కార్ల కంటే స్మూత్‌గా ఉండబోతున్నాయి.
పంచ్ ఫేస్‌లిఫ్ట్
టాటా కార్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న పంచ్ ఇప్పుడు కొత్త అవతారమెత్తబోతోంది. 2026 ప్రారంభంలో ఈ మైక్రో ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ కానుంది. దీని డిజైన్ చాలా వరకు పంచ్ ఈవీని పోలి ఉంటుంది. కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్‌తో పాటు లోపల ఇంటీరియర్ కూడా మారబోతోంది. ఇందులో ఆల్ట్రోజ్ కారులో ఉండే టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, 8 స్పీకర్ల ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉండబోతున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్ గా వస్తుండటం విశేషం. చిన్న కారు అయినా సరే, పెద్ద కార్లకు ఉండే ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి.
సియెర్రా ఈవీతో ఎలక్ట్రిక్ సంచలనం
రెట్రో లుక్ తో అలరించే టాటా సియెర్రా ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో రాబోతోంది. ఈ కారు కోసం టాటా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇందులో హారియర్ ఈవీలో వాడే 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని సమాచారం. దీని డిజైన్ పాత సియెర్రా జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే, ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో ఉండబోతోంది. మొత్తానికి వచ్చే ఏడాదిలో టాటా మోటార్స్ తన SUVల సైన్యంతో మార్కెట్‌ను ఒక ఊపు ఊపడానికి సిద్ధంగా ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

