TESLA: త్వరలో రోడ్లపైకి డ్రైవర్‌లెస్‌ కార్లు

TESLA: త్వరలో రోడ్లపైకి డ్రైవర్‌లెస్‌ కార్లు
X
టెస్లా కంపెనీలో డ్రైవర్‌లెస్‌ కార్ల రివల్యూషన్‌కి రూపకల్పన

అమెరికాలోని ప్రఖ్యాత టెస్లా కంపెనీలో డ్రైవర్‌లెస్‌ కార్ల రివల్యూషన్‌కి రూపకల్పన చేస్తోన్న భారతీయ యువ శాస్త్రవేత్త అశోక్‌ ఎల్లుస్వామికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆటోపైలట్‌ టెక్నాలజీలో మార్గదర్శకుడిగా నిలిచిన ఆయన.. ఎలాన్ మస్క్‌లా లాటి జీనియస్‌తో కలిసి పని చేస్తూ టెస్లా విజయయాత్రలో కీలకంగా నిలుస్తున్నారు.

టెస్లాలో ఏఐ సాఫ్ట్‌వేర్

ప్రస్తుతం అమెరికా కేంద్రంగా ఉన్న టెస్లాలో ఏఐ సాఫ్ట్‌వేర్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న అశోక్‌ టెస్లా ఆటోపైలట్‌ బృందంలో చేరిన మొదటి వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇటీవల ఓ యూట్యూబ్‌ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అశోక్‌, టెస్లా పనితీరుపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. " డ్రైవర్లపై ఆధారపడే అవసరం లేకుండా కార్లు నడిచే రోజులు తర్వలోనే రాబోతున్నాయి. 2035 నాటికి మొత్తం రోడ్లపై డ్రైవర్‌ లెస్‌ కార్లే నడుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో కారును స్వయంగా నడపాలనుకుంటే, పాత మోడల్‌ వాహనాలకే పరిమితి కావాల్సివస్తుంది" అని ఆయన చెప్పారు.

ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు

అమెరికాలో ఇప్పటికే కొన్ని నగరాల్లో డ్రైవర్‌-లెస్‌ టెస్లా కార్లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. అన్ని కార్లు ఒకే రకమైన ఏఐ టెక్నాలజీతో పనిచేస్తాయనీ, ఆ ఏఐని అభివృద్ధి చేయడంలో టెస్లా కీలక అడుగులు వేస్తోందనీ చెప్పారు. ఎలాన్‌ మస్క్‌తో కలసి పనిచేసిన అనుభవాన్ని కూడా ఆయన పంచుకున్నారు. "మస్క్‌ చాలా తెలివైనవారు. భవిష్యత్తు మార్గదర్శిగా ఆయన దూరదృష్టి అపారమైనది. వారానికి 80-90 గంటలు పనిచేస్తూ ప్రేరణగా నిలుస్తారు. కొత్త ఆలోచనలకు, రిస్క్‌ తీసుకోవడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆయనతో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని అన్నారు. అశోక్‌ ఎల్లుస్వామి, ఆటోపైలట్‌, కృత్రిమ మేధ టెక్నాలజీలను టెస్లా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మస్క్‌ కూడా స్వయంగా అశోక్‌, అతని బృందానికి సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

నిస్సాన్ మరో అడుగు ముందుకు

జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్... బ్రిటన్ గ్రామీణ రోడ్లపై కూడా నడపగలిగేలా జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ డ్రైవర్‌లెస్ కార్లను అభివృద్ధి చేస్తోంది. స్వయంగా డ్రైవ్ చేయలేని లేదా డ్రైవ్ చేయడానికి ఇష్టపడని ప్రయాణీకుల కోసం సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీలలో ఈ సాంకేతికతను ఉపయోగించాలనుకుంటోంది.

Tags

Next Story