Tesla : చైనా కంపెనీకి షాక్.. టెస్లా నుంచి చౌకైన మోడల్ రెడీ.

Tesla : ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అయిన టెస్లా, ఎక్కువ మందికి చేరువయ్యేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టెస్లా బాగా అమ్ముడవుతున్నా ఎస్యూవీ అయిన మోడల్ Yలో మోడల్ Y స్టాండర్డ్ అనే కొత్త, చౌకైన వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీని ధర 41,630డాలర్లు (రూ.34.7లక్షలు). ఇది పాత మోడల్ కంటే సుమారు 5,000డాలర్లు (రూ.4.2 లక్షలు) తక్కువ. ఈ తక్కువ ధర మోడల్‌తో టెస్లా ముఖ్యంగా చైనా కంపెనీ అయిన BYD వంటి కంపెనీల నుండి పోటీని తట్టుకోవాలని చూస్తోంది.
ధర తగ్గించడానికి కొత్త మోడల్ Y స్టాండర్డ్ డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు.. కానీ కారు చూడటానికి పాత మోడల్ లాగే ఉంటుంది. పాత మోడల్‌లో ఉండే పనోరమిక్ గ్లాస్ రూఫ్‌కు బదులుగా, ఈ కొత్త మోడల్‌లో సాలిడ్ మెటల్ రూఫ్‌ను అమర్చారు. ఇది లోపల టెంపరేచర్ కంట్రోల్ చేసేందుకు బాగా సాయపడుతుంది. లోపల లెదర్ సీట్ల స్థానంలో ఇప్పుడు ఫ్యాబ్రిక్ సీట్లు ఉన్నాయి. అలాగే, ముందు వైపు ఉన్న లైట్ బార్‌ను తొలగించి సాధారణ లైటింగ్‌ను ఇచ్చారు. కారు లేటెస్ట్, స్టైలిష్ లుక్ మాత్రం అలాగే ఉంది.
ధరను అదుపులో ఉంచడానికి, టెస్లా లోపల ఉన్న కొన్ని సౌకర్యవంతమైన ఫీచర్లను తొలగించింది. టెస్లాకు ప్రత్యేక గుర్తింపు అయిన 15.4 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ అలాగే ఉంది, ఇది కారులోని అన్ని ఫంక్షన్లను కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు స్టీరింగ్‌ను కేవలం మాన్యువల్‌గా మాత్రమే అడ్జస్ట్ చేయగలం. ముందు సీట్లలో వెంటిలేషన్ లేదు. వెనుక సీట్లలో హీటింగ్ ఫీచర్, వెనుక వారికి ఇష్టమైన 8.0-అంగుళాల స్క్రీన్‌ను కూడా పూర్తిగా తీసేశారు. ఈ మార్పులు ఉన్నా టెక్నాలజీ పరంగా ఈ కారు పూర్తి టెస్లా ఫీలింగ్‌ను ఇస్తుంది.
ధర తక్కువగా ఉన్నప్పటికీ, కారు పర్ఫామెన్స్ విషయంలో మాత్రం టెస్లా రాజీ పడలేదు. మోడల్ Y స్టాండర్డ్‌లో సింగిల్ రియర్ మోటార్, 69.5 kWh బ్యాటరీ ఉన్నాయి. ఇది 300 హార్స్‌పవర్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తుంది. టెస్లా చెప్పిన దాని ప్రకారం, ఈ ఎస్‌యూవీ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ కారు 6.8 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. ఇది చాలా వేగవంతమైనది.
భారత్‌లో లభించే లాంగ్ రేంజ్ మోడల్ Y సుమారు 574 కి.మీ రేంజ్ ఇచ్చి 5.7 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది, కానీ దాని ధర రూ.71.71 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ చౌకైన మోడల్ గ్లోబల్ మార్కెట్‌లోనే అందుబాటులో ఉంది. ఇది భారత్‌కు వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com