HBA: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన కేంద్రం..

HBA: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన కేంద్రం..
ఉద్యోగులారా..కొత్తగా ఇల్లు కట్టుకోవాల అనుకుంటున్నారా లేదా ఇల్లును కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీకో షాకింగ్ న్యూస్..

ఉద్యోగులారా..కొత్తగా ఇల్లు కట్టుకోవాల అనుకుంటున్నారా లేదా ఇల్లును కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీకో షాకింగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) వడ్డీ రేట్లను పెంచేసింది. అందువల్ల ఉద్యోగులపై ప్రభావం పడనుంది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మోదీ సర్కార్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేటును పెంచుతూ కీలక ప్రకటన చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే ఇదే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుత వడ్డీ రేట్లు 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. 7వ వేతనం సంఘం సిఫార్సుల మేరకే కేంద్రం తన ఉద్యోగులకు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ సదుపాయం కల్పిస్తోంది. ఈ రూల్స్ ప్రకారం కొత్త ఇల్లు కట్టుకునేందుకు ప్లాట్ కొనుగోలు చేసేందుకు ఇంటికి సంబంధించిన రిపేయిర్స్ చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి అడ్వాన్స్ రూపంలో లోన్ పొందొచ్చు. ఇంకా ఇల్లు నిర్మాణం లేదా కొనుగోలు కోసం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల లేదా హుడ్కో నుంచి లోన్ తీసుకొని ఉంటే తిరిగి చెల్లించేందుకు కూడా ప్రభుత్వం నుంచి HBA తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.ప్రస్తుత మార్కెట్లోని ఇతర హోం లోన్ 9 శాతం వడ్డీ రేట్లతో పోలిస్తే ఈ HBA తక్కువే ఉందని చెప్పొచ్చు.కేంద్ర ఉద్యోగులు హెచ్‌బీఏ కింద 34 నెలల బేసిక్ పే పొందొచ్చు. గరిష్టంగా రూ.25 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story