Tata Sierra : టాటా సియెరా వచ్చేస్తోంది.. ఈ 5 ఫీచర్లు మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాయి.

Tata Sierra : భారతీయ ఆటోమోటివ్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉన్న కారు... టాటా సియెరా. 90వ దశకంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఈ ఐకానిక్ ఎస్‌యూవీ, ఇప్పుడు మోడ్రన్ ఫీచర్లతో, పవర్ఫుల్ ICE, EV మోడల్స్‌లో కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. టాటా మోటార్స్ ఈ ప్రీమియం ఎస్‌యూవీని ఈ నెల నవంబర్ 25న అధికారికంగా తీసుకురానుంది. లాంచ్‌కు ముందే సియెరాలో ఉండబోయే 5 అదిరిపోయే ఫీచర్లు బయటకు వచ్చాయి. ఇవి మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయం.
టాటా సియెరా ఒకప్పుడు దాని ప్రత్యేకమైన డిజైన్‌తో మార్కెట్‌లో తనదైన ముద్ర వేసింది. 2000 సంవత్సరం ప్రారంభంలో దీని ఉత్పత్తి ఆగిపోయింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఎస్‌యూవీ మళ్లీ రాబోతోంది. టాటా మోటార్స్ ఈ ఎస్‌యూవీని నవంబర్ 25న ప్రీమియం రూపంలో విడుదల చేయనుంది. దీని కాన్సెప్ట్ మోడల్‌ను 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ కొత్త సియెరా పెట్రోల్/డీజిల్ (ICE), పూర్తి ఎలక్ట్రిక్ రియంట్లు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.
1. ట్రిపుల్ స్క్రీన్ సెటప్
కొత్త జనరేషన్ టాటా సియెరా ICE మోడల్‌లో టెక్నాలజీకి పెద్ద పీట వేస్తున్నారు. ఇందులో ఏకంగా మూడు స్క్రీన్‌లతో కూడిన సెటప్ ఉంటుంది. ఒక ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సెంటర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటాయి. ఈ కనెక్టెడ్ డిస్‌ప్లే ఫార్మాట్ కారు ఇంటీరియర్‌కు ఒక ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తుంది.
2. పనోరమిక్ సన్‌రూఫ్
భారత్‌లో ఎస్‌యూవీలలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కొత్త సియెరాలో ఒక పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తున్నారు. కారు క్యాబిన్ లోపల మరింత గాలి, వెలుతురు ఉండేలా ఇది చూస్తుంది. ఇది లోపల కూర్చున్న వారికి లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.
3. కంఫర్ట్, సౌకర్యాలు
టాటా సియెరాలో ప్రయాణికుల సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో ముఖ్యంగా...ముందు సీట్లకు వెంట్లేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యుయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మొబైల్ ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
4. 360-డిగ్రీ కెమెరా
పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ సౌలభ్యం కోసం, కొత్త సియెరాలో 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరాను ఇవ్వనున్నారు. ఈ ఫీచర్ కారు చుట్టూ ఉన్న దృశ్యాలను డ్రైవర్‌కు అందిస్తుంది. తద్వారా డ్రైవింగ్ మరింత సులభమవుతుంది.
5. లెవెల్ 2 ADAS
భద్రత విషయంలో టాటా ఎప్పుడూ ముందుంటుంది. కొత్త టాటా సియెరా ఎస్‌యూవీ లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్‌తో వస్తుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ టెక్నాలజీలు అందుబాటులో ఉంటాయి.Tata Sierra, Tata Sierra Launch, Sierra EV, New Tata SUV, Level 2 ADAS, Triple Screen Car, Panoramic Sunroof, Tata Motors, Car News India, November 25 Launch
The Iconic Tata Sierra Returns on Nov 25 Top 5 Features That Will Make Noise
Tata Sierra : టాటా సియెరా వచ్చేస్తోంది.. ఈ 5 ఫీచర్లు మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాయి
Tata Sierra : భారతీయ ఆటోమోటివ్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉన్న కారు... టాటా సియెరా. 90వ దశకంలోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన ఈ ఐకానిక్ ఎస్‌యూవీ, ఇప్పుడు మోడ్రన్ ఫీచర్లతో, పవర్ఫుల్ ICE, EV మోడల్స్‌లో కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. టాటా మోటార్స్ ఈ ప్రీమియం ఎస్‌యూవీని ఈ నెల నవంబర్ 25న అధికారికంగా తీసుకురానుంది. లాంచ్‌కు ముందే సియెరాలో ఉండబోయే 5 అదిరిపోయే ఫీచర్లు బయటకు వచ్చాయి. ఇవి మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయం.
టాటా సియెరా ఒకప్పుడు దాని ప్రత్యేకమైన డిజైన్‌తో మార్కెట్‌లో తనదైన ముద్ర వేసింది. 2000 సంవత్సరం ప్రారంభంలో దీని ఉత్పత్తి ఆగిపోయింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ఎస్‌యూవీ మళ్లీ రాబోతోంది. టాటా మోటార్స్ ఈ ఎస్‌యూవీని నవంబర్ 25న ప్రీమియం రూపంలో విడుదల చేయనుంది. దీని కాన్సెప్ట్ మోడల్‌ను 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ కొత్త సియెరా పెట్రోల్/డీజిల్ (ICE), పూర్తి ఎలక్ట్రిక్ రియంట్లు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది.
1. ట్రిపుల్ స్క్రీన్ సెటప్
కొత్త జనరేషన్ టాటా సియెరా ICE మోడల్‌లో టెక్నాలజీకి పెద్ద పీట వేస్తున్నారు. ఇందులో ఏకంగా మూడు స్క్రీన్‌లతో కూడిన సెటప్ ఉంటుంది. ఒక ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సెంటర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటాయి. ఈ కనెక్టెడ్ డిస్‌ప్లే ఫార్మాట్ కారు ఇంటీరియర్‌కు ఒక ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తుంది.
2. పనోరమిక్ సన్‌రూఫ్
భారత్‌లో ఎస్‌యూవీలలో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కొత్త సియెరాలో ఒక పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తున్నారు. కారు క్యాబిన్ లోపల మరింత గాలి, వెలుతురు ఉండేలా ఇది చూస్తుంది. ఇది లోపల కూర్చున్న వారికి లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.
3. కంఫర్ట్, సౌకర్యాలు
టాటా సియెరాలో ప్రయాణికుల సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో ముఖ్యంగా...ముందు సీట్లకు వెంట్లేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యుయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మొబైల్ ఫోన్‌ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
4. 360-డిగ్రీ కెమెరా
పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ సౌలభ్యం కోసం, కొత్త సియెరాలో 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరాను ఇవ్వనున్నారు. ఈ ఫీచర్ కారు చుట్టూ ఉన్న దృశ్యాలను డ్రైవర్‌కు అందిస్తుంది. తద్వారా డ్రైవింగ్ మరింత సులభమవుతుంది.
5. లెవెల్ 2 ADAS
భద్రత విషయంలో టాటా ఎప్పుడూ ముందుంటుంది. కొత్త టాటా సియెరా ఎస్‌యూవీ లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్‌తో వస్తుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోనమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ టెక్నాలజీలు అందుబాటులో ఉంటాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com