Donkey Milk : సంప్రదాయ వ్యాపారం కాదు.. కొత్త ఆలోచన.. గాడిద పాలతో లక్షల్లో ఆదాయం.

Donkey Milk : సంప్రదాయ వ్యాపారం కాదు.. కొత్త ఆలోచన.. గాడిద పాలతో లక్షల్లో ఆదాయం.
X

Donkey Milk : భారతదేశంలో వ్యవసాయం పాడి పరిశ్రమ అంటే వెంటనే గుర్తొచ్చేవి ఆవులు గేదెలు. కానీ ఇప్పుడు అత్యధిక లాభాలు తెచ్చిపెడుతున్న ఒక కొత్త వ్యాపారం మొదలైంది. అదే గాడిద పాల వ్యాపారం . బరువు మోయడానికి మాత్రమే పనికొస్తుందనుకున్న గాడిద ఇప్పుడు కొంతమంది రైతులకు లక్షాధికారులను చేసే కీలక వనరుగా మారింది. దీనికి కారణం ఈ పాలు మార్కెట్‌లో అత్యంత ఖరీదైనవిగా లభిస్తున్నాయి. ఒక లీటరు గాడిద పాల ధర రూ.5,000 నుంచి రూ.7,000 వరకు పలుకుతోంది.

సాధారణంగా తాగే పాలు కాకుండా, గాడిద పాల వాడకం ప్రధానంగా రెండు పరిశ్రమలలో ఉంది.. ప్రాచీన కాలంలో ఈజిప్టు రాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతో స్నానం చేసేవారని ప్రతీతి. చర్మాన్ని అందంగా మృదువుగా ఉంచే అద్భుతమైన గుణాలు ఇందులో ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా కాస్మెటిక్ కంపెనీలు బ్యూటీ సోప్స్, లోషన్లు వంటి వాటి తయారీకి ఈ పాలను అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నాయి. ఆవు పాలు తాగలేని లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవారికి గాడిద పాలు ఒక మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ప్రొటీన్లు యాంటీ-మైక్రోబియల్ గుణాలు అధికంగా ఉండటం వలన జీర్ణశక్తిని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.

గాడిద పాలను నేరుగా అమ్మడం కంటే, వాటిని ప్రాసెస్ చేసి అమ్మితే ఆదాయం లక్షల్లో ఉంటుంది. పాలను పౌడర్ లేదా పన్నీర్‌గా మార్చడం వల్ల వాటి ధర ఊహించని విధంగా పెరుగుతుంది: గాడిద పాలతో తయారు చేసే ప్రత్యేకమైన పన్నీర్ ధర మార్కెట్‌లో కిలో రూ.65,000 వరకు పలుకుతోంది. అదే పాలను పొడి రూపంలో మార్చి అమ్మితే, దాని ధర కిలో రూ.లక్ష వరకు కూడా చేరుతోంది. బెంగళూరు హైదరాబాద్ వంటి ఐటీ నగరాల్లో ఈ ప్రత్యేకమైన పాలు ఉత్పత్తులకు డిమాండ్ ఇటీవల బాగా పెరిగింది.

గాడిద పాల బిజినెస్ కొత్త పెట్టుబడిదారులకు మంచి అవకాశాలను అందిస్తోంది. తక్కువ సంఖ్యలో గాడిదలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించినా పాల ధర అధికంగా ఉండటం వల్ల త్వరగా లాభాలు పొందవచ్చు. ఈ పాల నుంచి విలువైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా, గ్రామీణ రైతులు యువ పారిశ్రామికవేత్తలు అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. అందుకే సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి బయటపడి, ఈ కొత్త ట్రెండ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు.

Tags

Next Story