కొత్త ఇల్లు కొన్న బాలయ్యబాబు! రికార్డ్ స్థాయిలో ధర

కొత్త ఇల్లు కొన్న బాలయ్యబాబు! రికార్డ్ స్థాయిలో ధర
సినిమారంగంలో తన కలెక్షన్లతో బాక్సాఫీస్ షేక్ చేసే బాలయ్య రియల్ఎస్టేట్ రంగంలోనూ తన కొనుగోలుతో రికార్డ్ స్థాయి ధర పలకించారు

నందమూరి నటసింహం బాలయ్యబాబు ఓ ఇల్లు కొన్నారు. రూ.15 కోట్లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దీంతో సినిమారంగంలో తన కలెక్షన్లతో బాక్సాఫీస్ షేక్ చేసే బాలయ్య.. ఇప్పుడు రియల్ఎస్టేట్ రంగంలోనూ తన కొనుగోలుతో రికార్డ్ స్థాయి ధర పలకించారని చెప్పాలి

ఫిబ్రవరి 11,2021న ఈ డీల్ పూర్తి చేసారు బాలయ్య. నడింపల్లి సత్యశ్రావణి నుంచి ఆయన ఈ ఇల్లు కొనుగోలు చేసినట్లు జాప్‌కీ డాట్ కామ్( Zapkey.com) వెబ్‌సైట్ చెప్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మరో రెండు అంతస్థులు కలిగిన ఈ భవంతి మొత్తం 9395 చదరపు అడుగుల్లో బిల్టప్ ఏరియా ఉంది. ఈ భవంతిని బాలయ్యబాబు దంపతులు ఇద్దరి పేరిట జాయింట్‌గా కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ని బట్టి తెలుస్తోంది.

మొత్తం స్టాంప్ డ్యూటీ రూ.82.5లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.7.5లక్షలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ బ్రేక్ అవగానే ఇదెక్కడ ఉందాని బాలయ్య అభిమానులు గూగుల్‌లో వెతకతున్నారు.

వందకిపైగా సినిమాలు చేసిన బాలకృష్ణ వయసు ఎప్పటికప్పుడు తగ్గిందా అన్పించేలా హుషారుగా పని చేస్తుంటారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ డైరక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నారాయన.

Also Read :

ఘట్‌కేసర్ ఫార్మసీ అమ్మాయి సూసైడ్ కేసులో ట్విస్ట్..!

తాతా.. నీ కష్టం వృధాగా పోలేదు..!

అంత్యక్రియల చెక్కు ఇచ్చేందుకు కూడా అయిదు వేల లంచం అడిగాడు!

Tags

Read MoreRead Less
Next Story