Credit Card : జేబులో ఈ కార్డ్ ఉంటే చాలు..ఎయిర్‌పోర్ట్‌లో ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లగ్జరీ మీ సొంతం.

Credit Card : జేబులో ఈ కార్డ్ ఉంటే చాలు..ఎయిర్‌పోర్ట్‌లో ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లగ్జరీ మీ సొంతం.
X

Credit Card : విమాన ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో గంటల తరబడి వేచి ఉండటం చాలా విసుగు కలిగిస్తుంది. అదే ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో అయితే హాయిగా ఏసీలో కూర్చుని, ఉచితంగా భోజనం చేస్తూ, వై-ఫై వాడుకుంటూ సేద తీరవచ్చు. ఒకప్పుడు ఇది ధనికులకు మాత్రమే సాధ్యమయ్యేది, కానీ ఇప్పుడు మీ దగ్గర సరైన క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు.. రాజభోగం అనుభవించవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉచిత లాంజ్ యాక్సెస్ ఇస్తున్న టాప్ 5 క్రెడిట్ కార్డ్‌ల గురించి తెలుసుకుందాం.

1. యాక్సిస్ హారిజన్ క్రెడిట్ కార్డ్ : తరచుగా విమాన ప్రయాణాలు చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని ద్వారా ఏడాదికి 8 డొమెస్టిక్ లాంజ్ విజిట్స్, ప్రతి మూడు నెలలకు 2 ఇంటర్నేషనల్ లాంజ్ విజిట్స్ లభిస్తాయి. మీరు కార్డు తీసుకున్న 30 రోజుల్లో 10 వేల రూపాయలు ఖర్చు చేస్తే 5,000 ఎడ్జ్ మైల్స్ వెల్కమ్ బోనస్‌గా ఇస్తారు. దీని యాన్యువల్ ఫీజు రూ.3,000.

2. ఇక్సిగో ఏయూ క్రెడిట్ కార్డ్ : ఈ కార్డు ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఎలాంటి జాయినింగ్ ఫీజు లేదా వార్షిక ఫీజు ఉండదు. ఉచితం అయినప్పటికీ, ఇది ఏడాదికి 16 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ లాంజ్ విజిట్ ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఫ్లైట్ బుకింగ్స్‌పై 10% డిస్కౌంట్, విదేశాల్లో వాడితే జీరో ఫారెక్స్ ఛార్జీలు వంటి సౌకర్యాలు ఉన్నాయి.

3. ఎస్బీఐ మైల్స్ క్రెడిట్ కార్డ్ : ప్రీమియం ట్రావెల్ అనుభవం కోరుకునే వారు ఈ కార్డు తీసుకోవచ్చు. ఏడాదికి 6 ఇంటర్నేషనల్ మరియు ప్రతి త్రైమాసికానికి 2 డొమెస్టిక్ లాంజ్ విజిట్స్ ఇందులో ఉంటాయి. అదనంగా ఉచిత ప్రయారిటీ పాస్ మెంబర్‌షిప్ కూడా లభిస్తుంది. దీని వార్షిక ఫీజు రూ.4,999. క్రమం తప్పకుండా విదేశాలకు వెళ్లే వారికి ఇది బాగా సెట్ అవుతుంది.

4. మారియట్ బాన్వాయ్ హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ : మీరు లాంజ్ యాక్సెస్‌తో పాటు హోటల్ స్టే కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది సరైన ఎంపిక. ఇందులో దేశీయ, అంతర్జాతీయ లాంజ్ విజిట్స్‌తో పాటు ఉచితంగా హోటల్ నైట్ స్టే ఆఫర్లు ఉంటాయి. డైనింగ్, ఎంటర్టైన్‌మెంట్ మీద మంచి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. దీని ఫీజు రూ.3,000.

5. ఇండస్‌ఇండ్ బ్యాంక్ టైగర్ క్రెడిట్ కార్డ్ : బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. దీనికి ఎలాంటి వార్షిక రుసుము లేదు. ఏడాదికి 2 ఇంటర్నేషనల్, ప్రతి త్రైమాసికానికి 2 డొమెస్టిక్ లాంజ్ విజిట్స్ ఉచితంగా లభిస్తాయి. అప్పుడప్పుడు ప్రయాణాలు చేసే వారికి ఈ కార్డు సరిపోతుంది.

Tags

Next Story