Mileage Bikes : మైలేజ్ కింగ్స్.. 150-200ccలో అదిరిపోయే టాప్ 5 బైక్‌లు ఇవే.

Mileage Bikes : భారతదేశంలో టూ వీలర్ మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. 2025 గణాంకాలను పరిశీలిస్తే.. ఏకంగా 2 కోట్ల యూనిట్ల విక్రయాలతో 78 శాతం వృద్ధిని నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. అయితే, బైక్ ఏదైనా సరే భారతీయులు మొదట అడిగే ప్రశ్న.. మైలేజ్ ఎంత ఇస్తుంది?. ముఖ్యంగా 150cc నుంచి 200cc సెగ్మెంట్‌లో పవర్ కోసం చూస్తూనే, పెట్రోల్ ఖర్చు తగ్గాలనుకునే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం అదిరిపోయే మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్‌ల వివరాలు తెలుసుకుందాం.
1. టీవీఎస్ అపాచీ RTR 160
మైలేజ్ విషయంలో ఈ సెగ్మెంట్‌లో రారాజు ఎవరంటే కళ్లు మూసుకుని టీవీఎస్ అపాచీ RTR 160 అని చెప్పవచ్చు. ఇది 2V, 4V అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ముఖ్యంగా RTR 160 2V మోడల్ లీటరుకు ఏకంగా 61 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీని ధర కూడా రూ.1.12 లక్షల నుంచి రూ.1.24 లక్షల మధ్య ఉండటంతో సామాన్యులకు ఇది బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి ఇది పక్కా ఛాయిస్.
2. బజాజ్ పల్సర్ NS160
స్పోర్టీ లుక్ కావాలి.. అదే సమయంలో మైలేజ్ కూడా బాగుండాలి అనుకునే యువతకు పల్సర్ NS160 కేరాఫ్ అడ్రస్. ఇందులో 160.3cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది, ఇది 17.03 BHP పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అడ్వాన్స్‌డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వల్ల ఇది సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవేపై కూడా అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. దీని ధర రూ.1.21 లక్షల నుంచి రూ.1.29 లక్షల వరకు ఉంటుంది. పవర్, పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండే బైక్ ఇది.
3. బజాజ్ పల్సర్ N160
బజాజ్ నుంచి వస్తున్న మరో ఆణిముత్యం పల్సర్ N160. ఈ బైక్ లీటరుకు సుమారు 51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. నేటి కాలపు టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్, బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్న వారికి ఇది సరైన ఎంపిక. దీని ధర రూ.1.14 లక్షల నుంచి ప్రారంభమై రూ.1.27 లక్షల వరకు ఉంటుంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.
4. యమహా R15 V4
ట్రాక్ రేసింగ్ బైక్‌లను ఇష్టపడే వారికి యమహా R15 ఒక కల. అయితే ఇది కేవలం వేగానికే కాదు, మైలేజ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తున్న ఈ బైక్ లీటరుకు 50 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇస్తుంది. ఒక ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ ఇంతటి మైలేజ్ ఇవ్వడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. దీని ధర రూ.1.66 లక్షల నుంచి రూ.1.71 లక్షల మధ్య ఉంటుంది. స్టైల్ కోసం ప్రాణమిచ్చే కుర్రాళ్లకు ఇది ఫేవరెట్ బైక్.
5. హోండా యూనికార్న్
దశాబ్దాలుగా భారతీయ రోడ్లపై నమ్మకానికి మారుపేరుగా నిలిచింది హోండా యూనికార్న్. 162.7cc ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్.. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజ్‌కు పెట్టింది పేరు. రోజువారీ సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి యూనికార్న్ ఇచ్చే కంఫర్ట్ మరే బైక్ ఇవ్వదు. దీని ఇంజిన్ చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా ఇంధనాన్ని చాలా పొదుపుగా వాడుకుంటుంది. దీని ధర సుమారు రూ.1.13 లక్షలుగా ఉంది. ఫ్యామిలీ మెన్, కమ్యూటర్ రైడర్లకు ఇది ఆల్ టైమ్ హిట్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
