125cc Bikes : రూ.లక్ష లోపు దొరికే టాప్ 5 125సీసీ బైక్‌లు.. తక్కువ ధరలో ఎక్కువ పవర్, స్టైల్ కావాలంటే ఇవే బెస్ట్!

125cc Bikes : రూ.లక్ష లోపు దొరికే టాప్ 5 125సీసీ బైక్‌లు.. తక్కువ ధరలో ఎక్కువ పవర్, స్టైల్ కావాలంటే ఇవే బెస్ట్!
X

125cc Bikes : భారతదేశంలో కమ్యూటర్ బైక్ సెగ్మెంట్‌లో 125cc విభాగం ఒక స్ట్రాంగ్ ఆప్షన్ గా ఉంది. బడ్జెట్ పరిమితిని దాటకుండా, మంచి పర్ఫామెన్స్, పవర్‌ఫుల్ ఇంజన్ కలయికను కోరుకునే రైడర్‌లకు ఈ 125సీసీ బైక్‌లు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా రూ.లక్ష లోపు ధరలో ఇప్పుడు 11-12 హార్స్‌పవర్ శక్తి, స్పోర్ట్స్ స్టైల్ అడ్వాన్సుడ్ ఫీచర్లతో కూడిన బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్‌లో హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ నుంచి హోండా ఎస్‌పీ 125 వరకు అత్యంత పవర్ఫుల్ 125cc బైక్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్

హీరో మోటోకార్ప్ నుండి వచ్చిన ఈ బైక్, 125cc సెగ్మెంట్‌లో అత్యుత్తమ పర్ఫామెన్స్ ప్యాకేజీని అందిస్తుంది. దీని స్పోర్టీ లుక్ , ఆకర్షణీయమైన ఫీచర్లు యువ రైడర్‌లను బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ బైక్ 11.4 hp పవర్, 10.5 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.89,000 మాత్రమే. స్పోర్టీ లుక్, అద్భుతమైన పర్ఫామెన్స్ కోరుకునే వారికి, లక్ష రూపాయల లోపు ధరలో ఇది చాలా మంచి ఎంపిక.

2. హోండా ఎస్‌పీ 125

హోండా ఎస్‌పీ 125 బైక్ రోజువారీ వినియోగానికి అనుకూలంగా రూపొందించారు. ఇది సురక్షితమైన, సమర్థవంతమైన రైడ్‌ను అందిస్తుంది. 123.94 cc ఇంజిన్ దాదాపు 10.72 hp పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.85,815. ముఖ్యంగా, ఈ బైక్ దాదాపు లీటరుకు 63 కిమీ మైలేజ్ ఇస్తుంది. మైలేజ్, నమ్మదగిన ఇంజిన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారికి ఇది ఉత్తమ ఎంపిక.

3. బజాజ్ పల్సర్ 125

బజాజ్ తన ప్రసిద్ధ పల్సర్ డీఎన్‌ఏను 125cc సెగ్మెంట్‌లో ముందుకు తీసుకువెళ్లడంలో సఫలమైంది. 124.4 cc ఇంజిన్ తో వచ్చే ఈ బైక్ దాదాపు 11.63 hp పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.79,048. పల్సర్ బ్రాండ్‌ను ఇష్టపడే వారికి, తక్కువ ధరలో స్పోర్టీ కమ్యూటర్ ఫీల్, ఉత్తమ పర్ఫామెన్స్ అందించే ఈ బైక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది లక్ష రూపాయల లోపు అత్యంత ఆకర్షణీయమైన ఎంపికలలో ఒకటి.

4. టీవీఎస్ రైడర్

టీవీఎస్ రైడర్ 125cc విభాగంలో అత్యంత ఫీచర్-రిచ్ బైక్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఇది యువతను ఆకర్షించే ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంది. 124.8 cc ఇంజిన్ 11.22 hp ఎనర్జీని 11.75 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఈ సెగ్మెంట్‌లో ఇదే అత్యధిక టార్క్. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.80,500. అగ్రెసివ్ స్టైలింగ్, మోడ్రన్ ఫీచర్ల కోసం ఈ బైక్ ప్రజాదరణ పొందింది.

5. బజాజ్ పల్సర్ N125

బజాజ్ పల్సర్ N125 అనేది 125cc సెగ్మెంట్‌కు కొత్త యుగం పల్సర్ డిజైన్ లాంగ్వేజ్‌ను తీసుకొచ్చింది. ఇది పాత పల్సర్ కంటే మరింత ఆధునికంగా కనిపిస్తుంది. 124.59 cc ఇంజిన్ 11.83 hp ఎనర్జీని 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.91,692. షార్ప్ LED హెడ్‌ల్యాంప్ సెటప్, స్పోర్టీ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లు, డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్టైలిష్ కమ్యూటర్ బైక్ కోరుకునే వారికి ఇది సరైనది.

Tags

Next Story