Safest Cars : ప్రాణాలు కాపాడే కార్లు ఇవే.. భారత్ ఎన్ క్యాప్ 5-స్టార్ రేటింగ్ పొందిన టాప్-5 మోడల్స్.

Safest Cars : భారతీయ వాహనదారుల ఆలోచనా ధోరణిలో ఇప్పుడు పెను మార్పు వచ్చింది. ఒకప్పుడు కారు కొనేటప్పుడు కేవలం మైలేజీ, ఫీచర్లు మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు సేఫ్టీ అనేది అందరి ప్రాధాన్యతగా మారింది. దీనికి తోడు మన దేశంలోనే కార్ల భద్రతను పరీక్షించే భారత్ ఎన్ క్యాప్ అందుబాటులోకి రావడంతో, ఏ కారు ఎంత సురక్షితమో కస్టమర్లకు స్పష్టంగా తెలుస్తోంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు కారులోని పెద్దలకు, పిల్లలకు ఏ మేరకు సేఫ్టీఉంటుందో స్టార్ రేటింగ్‌ల ద్వారా ఇది వెల్లడిస్తుంది. భారత్ ఎన్ క్యాప్ పరీక్షల్లో సత్తా చాటిన టాప్-5 అత్యంత సురక్షితమైన కార్ల వివరాలు తెలుసుకుందాం.
మహీంద్రా BE 6
మహీంద్రా నుండి వచ్చిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా BE 6 సేఫ్టీ విషయంలో అద్భుతమైన స్కోరు సాధించింది. భారత్ ఎన్ క్యాప్ పరీక్షల్లో పెద్దల సేఫ్టీవిభాగంలో 32 పాయింట్లకు గానూ 31.97 సాధించగా, పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు 45 సాధించి 5-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. బలమైన బాడీ స్ట్రక్చర్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్సుడ్ సేఫ్టీ సిస్టమ్స్ ఈ కారును సేఫ్టీలో రారాజుగా నిలబెట్టాయి.
టాటా పంచ్
మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా పంచ్ తన సత్తాను మరోసారి నిరూపించుకుంది. ఈ కారు పెద్దల సేఫ్టీలోలో 30.58 పాయింట్లు, పిల్లల సెఫ్టీలో 45 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్ పొందింది. తక్కువ ధరలో గట్టి కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. స్టేబుల్ బాడీ షెల్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ వంటి ఫీచర్లు దీని సొంతం.
టాటా హారియర్ EV
ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోరుకునే వారికి టాటా హారియర్ EV ఒక కవచంలాంటిది. ఇది పెద్దల సేఫ్టీలో 32/32 ఫుల్ స్కోర్ సాధించడమే కాకుండా, పిల్లల సేఫ్టీలో కూడా 49/49 క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్, అత్యధిక ఎయిర్‌బ్యాగ్‌లతో ఇది రోడ్లపై తిరిగే ఒక ట్యాంక్ లాంటిదని చెప్పవచ్చు. లగ్జరీతో పాటు ప్రాణాలకు భరోసా ఇచ్చే కారు ఇది.
టయోటా ఇన్నోవా హైక్రాస్
పెద్ద కుటుంబాలకు ఫేవరెట్ అయిన టయోటా ఇన్నోవా హైక్రాస్ కూడా 5-స్టార్ రేటింగ్ సాధించింది. పెద్దల సేఫ్టీలో 30.47, పిల్లల సేఫ్టీలో 45 స్కోరుతో ఇది అత్యంత నమ్మకమైన ఎంపీవీగా నిలిచింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ మౌంట్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫ్యామిలీ ట్రిప్పులకు ఇది అత్యంత సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
స్కోడా కైలక్
కాంపాక్ట్ ఎస్‌యూవీ కేటగిరీలో స్కోడా కైలక్ కూడా 5-స్టార్ రేటింగ్‌తో దుమ్మురేపింది. పెద్దల రక్షణలో 30.88, పిల్లల రక్షణలో 45 పాయింట్లు సాధించింది. స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో ఇది అటు పర్ఫార్మెన్స్, ఇటు సేఫ్టీని బ్యాలెన్స్ చేసే ప్యాకేజీగా మారింది. కారు కొనేముందు దాని రంగు, డిజైన్ మాత్రమే కాదు.. ఇలాంటి సేఫ్టీ రేటింగ్‌లను కూడా గమనించడం ప్రాణాలకు రక్షణగా మారుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
