Toyota Hyryder 7 Seater : టయోటా నుంచి అదిరిపోయే 7-సీటర్.. మహీంద్రా XUV 7XOకు ఇక చుక్కలే

Toyota Hyryder 7 Seater : టయోటా నుంచి అదిరిపోయే 7-సీటర్.. మహీంద్రా XUV 7XOకు ఇక చుక్కలే
X

Toyota Hyryder 7 Seater : స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తున్న టయోటా, ఇప్పుడు ఫ్యామిలీ కస్టమర్ల కోసం మరో అదిరిపోయే వార్త తెచ్చింది. తన పాపులర్ మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‎ని ఇప్పుడు సరికొత్త 7-సీటర్ వెర్షన్‌లో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల లడఖ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఈ కారు టెస్టింగ్ చేస్తూ కనిపించింది.

వ్యాపార విస్తరణలో భాగంగా టయోటా, మారుతి సుజుకి సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. మారుతి సుజుకి కూడా తన గ్రాండ్ విటారాకు 7-సీటర్ వెర్షన్‌ను (కోడ్ నేమ్: Y17) సిద్ధం చేస్తోంది. ఈ రెండు కార్లు భారత మార్కెట్లో మహీంద్రా XUV 7XO, టాటా సఫారి, హ్యుందాయ్ అల్కాజార్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తున్నాయి.

టెస్టింగ్‌లో కనిపించిన మోడల్ ప్రకారం.. ప్రస్తుత 5-సీటర్ హైరైడర్ కంటే ఇది పొడవుగా ఉంది. మూడో వరుస ప్రయాణికుల కోసం వీల్‌బేస్‌ను పొడిగించారు. బయటి వైపు కొత్త డిజైన్‌తో కూడిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, భారీ అలాయ్ వీల్స్, కొత్త ఫ్రంట్ గ్రిల్ ఉండబోతున్నాయి. లోపలి భాగంలో వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, 10-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Level 2 ADAS వంటి అత్యాధునిక రక్షణ వసతులు ఉండే అవకాశం ఉంది.

ఈ 7-సీటర్ హైరైడర్ కూడా హైబ్రిడ్ టెక్నాలజీతో రానుంది. ఇందులో 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది, ఇది లీటరుకు సుమారు 25 కి.మీ పైగా మైలేజీ ఇస్తుందని అంచనా. అలాగే, 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు AllGrip (AWD) ఆల్‌వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కూడా టయోటా అందించనుంది. దీనివల్ల కొండ ప్రాంతాల్లో లేదా కఠినమైన రోడ్లపై ప్రయాణం మరింత సులభమవుతుంది.

Tags

Next Story