Toyota Urban Cruiser EV : టయోటా ఎలక్ట్రిక్ సునామీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ.. నేడే లాంచ్.

Toyota Urban Cruiser EV :భారత ఆటోమొబైల్ రంగంలో నమ్మకానికి మారుపేరైన టయోటా, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి భారీ ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం ఖరారు చేసింది. తన మొట్టమొదటి మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్ఈవీ అర్బన్ క్రూయిజర్ ఈవీని జనవరి 19, 2026 నుండి విక్రయానికి సిద్ధం చేస్తోంది. మారుతి సుజుకి ఈ-విటారాకు రీ-బ్యాజ్డ్ వెర్షన్‌గా వస్తున్న ఈ కారు, టయోటా మార్క్ డిజైన్‌తో సరికొత్త హంగులను అద్దుకుంది. మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి దిగ్గజ కార్లకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఇది రోడ్లపైకి రాబోతోంది.
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్ఈవీ ధరల విషయంలో టయోటా నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం దీని బేస్ వేరియంట్ రూ. 21 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 26 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రైస్ పాయింట్ వద్ద ఇది లగ్జరీ ఫీచర్లను అందిస్తూనే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసింది.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీలో మారుతి ఈ-విటారా తరహాలోనే 49kWh, 61kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించనున్నారు. చిన్న బ్యాటరీ ప్యాక్ 144bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తే, పెద్ద బ్యాటరీ ప్యాక్ ఏకంగా 174bhp పవర్‌ను ఇస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. లాంగ్ రైడ్స్‌కు వెళ్లాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వెసులుబాటు. ఇందులో ఉన్న ఫ్రంట్-యాక్సిల్ మోటార్ కారుకు మంచి వేగాన్ని మరియు గ్రిప్‌ను అందిస్తుంది.
కారు లోపలి భాగాన్ని టయోటా చాలా లగ్జరీగా ఉండేలా తీర్చిదిద్దింది. 10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డ్రైవర్ కోసం 10.25 ఇంచుల డిజిటల్ డిస్ప్లే, ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, అద్భుతమైన గ్లాస్ రూఫ్ దీని ప్రత్యేకతలు. సేఫ్టీ పరంగా లెవల్ 2 అడాస్, 7 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఈ కారును సేఫెస్ట్ ఈవీగా నిలబెడుతున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

