Toyota EV : టయోటా నుంచి మరో ఎలక్ట్రిక్ సెన్సేషన్..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు.

Toyota EV : నమ్మకానికి మారుపేరుగా నిలిచే టయోటా కంపెనీ, భారత మార్కెట్లోకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును దింపేందుకు రంగం సిద్ధం చేసింది. టయోటా అర్బన్ క్రూయిజర్ BEV పేరుతో రాబోతున్న ఈ కారు, 2026 ప్రథమార్థంలో మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. మారుతి సుజుకి ఈ-విటారా ఆధారంగా రూపొందుతున్న ఈ కారును గుజరాత్‌లోని సుజుకి ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. కొత్త Heartect-e ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ద్వారా ఇండియాలోని ఈవీ మార్కెట్లో టయోటా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది.
ఈ కారు డిజైన్ చూస్తే చాలా మోడ్రన్‌గా, ఫ్యూచరిస్టిక్ స్టైల్‌లో ఉండబోతోంది. ముందు భాగంలో సన్నని ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, క్లోజ్డ్ గ్రిల్, స్టైలిష్ ఎయిర్ వెంట్స్ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. కారు లోపల కూడా ఎక్కడా తగ్గకుండా డ్యూయల్ టోన్ క్యాబిన్, పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ వంటి అధునాతన హంగులను టయోటా జోడిస్తోంది.
టెక్నాలజీ పరంగా ఈ కారు అదరగొట్టేలా ఉంది. ఇందులో 49 kWh, 61 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు లభించవచ్చు. పెద్ద బ్యాటరీ వెర్షన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 నుంచి 550 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. సేఫ్టీకి పెద్దపీట వేస్తూ 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా వంటి కీలక ఫీచర్లను ఇందులో చేర్చారు. ఈ కారు ధర సుమారు 20 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో టయోటా క్వాలిటీ కోసం ఎదురుచూసే వారికి ఇది ఒక మంచి ఆప్షన్ కానుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

