Toyota : ఫార్చ్యూనర్ కంటే ఆ కారే నయం..టయోటాలో ఒక్క నెలలో 9295 యూనిట్లు సేల్స్‎తో రికార్డు.

Toyota : ఫార్చ్యూనర్ కంటే ఆ కారే నయం..టయోటాలో ఒక్క నెలలో 9295 యూనిట్లు సేల్స్‎తో రికార్డు.
X

Toyota : టయోటా ఫార్చ్యూనర్‎కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. కానీ, ఫార్చ్యూనర్ కంటే కూడా టయోటా నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఏంటో తెలుసా? గత నెలలో టయోటా మొత్తం 30,085 కార్లను విక్రయించింది. ఈ అమ్మకాల్లో కంపెనీ 19 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. టయోటా టాప్-5 అమ్ముడైన మోడళ్లలో, మొదటి స్థానంలో నిలిచిన కారు ఇన్నోవా రేంజ్- ఇందులో హైక్రాస్, క్రిస్టా మోడల్స్ ఉన్నాయి. నవంబర్ నెలలో ఇన్నోవా సిరీస్ మొత్తం 9,295 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది ఇదే నెలతో పోలిస్తే 18 శాతం ఎక్కువ. ఫ్యామిలీ-ఓరియెంటెడ్ ప్యాకేజింగ్, హైబ్రిడ్ ఆకర్షణ కారణంగా ఇన్నోవాకు భారీ డిమాండ్ కొనసాగుతోంది.

ఇన్నోవా తర్వాత రెండవ స్థానంలో టయోటా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన గ్లాంజా ఉంది. గ్లాంజా నవంబర్‌లో 5,032 యూనిట్ల అమ్మకాలతో, 32 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. మూడవ స్థానంలో టయోటా టైసర్ నిలిచింది. ఈ కారు అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 12 శాతం తగ్గినప్పటికీ (3,177 యూనిట్లు), ఇది టాప్ 5లో స్థానం సంపాదించింది. ఇక నాల్గవ స్థానంలో టయోటా రూమియన్ ఉంది. ఇది గత నెలలో 1,818 యూనిట్లు అమ్మి, కేవలం 1 శాతం స్వల్ప వృద్ధిని చూపించింది.

టయోటా టాప్ 5 జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నది టయోటా హైరైడర్. ఈ మోడల్ గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఏకంగా 52 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో 7,393 యూనిట్ల హైరైడర్‌లు అమ్ముడయ్యాయి. ఇక టయోటా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన ఫార్చ్యూనర్ విషయానికి వస్తే, గత నెలలో దీని అమ్మకాలు 2,676 యూనిట్లు మాత్రమే. ఇది గత ఏడాది నవంబర్ అమ్మకాలతో (2,865 యూనిట్లు) పోలిస్తే 7 శాతం క్షీణతను సూచిస్తోంది. దీనిని బట్టి ఫార్చ్యూనర్ అంటే క్రేజ్ ఉన్నప్పటికీ, వినియోగదారులు మాత్రం అత్యధికంగా ఇన్నోవా సిరీస్‌ను ఇష్టపడుతున్నారని స్పష్టమవుతోంది.

Tags

Next Story