TRADE BILL: భారత్-అమెరికా మధ్య 'మినీ ట్రేడ్ డీల్'

TRADE BILL: భారత్-అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్
X
వాషింగ్టన్‌లో జోరుగా తుది దశ చర్చలు.. 48 గంటల్లో కీలక ఒప్పందం వచ్చేదేనా?

భా­ర­త్‌-అమె­రి­కా మధ్య వా­ణి­జ్య సం­బం­ధా­లు కొ­త్త మలు­పు తి­రి­గే అవ­కా­శం కని­పి­స్తోం­ది. ఇరు­దే­శాల మధ్య మినీ ట్రే­డ్ డీల్ (మధ్యం­తర వా­ణి­జ్య ఒప్పం­దం) కు­ద­ర­ను­న్న సూ­చ­న­లు కని­పి­స్తు­న్నా­యి. వా­షిం­గ్ట­న్‌­లో కొ­న­సా­గు­తు­న్న చర్చ­లు తుది దశకు చే­రు­కు­న్నా­య­ని వా­ణి­జ్య వర్గా­లు వె­ల్ల­డిం­చా­యి. వచ్చే 48 గం­ట­ల్లో ఈ ఒప్పం­దం ఖరా­ర­య్యే అవ­కా­శ­ముం­ద­ని జా­తీయ మీ­డి­యా ని­వే­ది­క­లు పే­ర్కొ­న్నా­యి. ఈ ఒప్పం­దం­లో ప్ర­ధా­నం­గా వ్య­వ­సా­యం, ఆటో­మొ­బై­ల్, ఇం­డ­స్ట్రి­య­ల్ గూ­డ్స్, లే­బ­ర్ ఇం­టె­న్సి­వ్ ప్రొ­డ­క్ట్స్‌­పై దృ­ష్టి­పె­ట్టి­న­ట్లు తె­లు­స్తోం­ది. అయి­తే కొ­న్ని కీలక రం­గా­ల్లో ఇప్ప­టి­కీ ఇరు­దే­శాల మధ్య అభి­ప్రా­య­భే­దా­లు కొ­న­సా­గు­తు­న్నా­యి. ము­ఖ్యం­గా డె­యి­రీ రం­గం­లో భా­ర­త్‌ తన మా­ర్కె­ట్‌­ను వి­దే­శీ కం­పె­నీ­ల­కు పూ­ర్తి­గా తె­రి­చేం­దు­కు సి­ద్ధం­గా లే­క­పో­వ­డం వల్ల చర్చ­లు సవా­లు­గా మా­రా­యి. మరో­వై­పు అమె­రి­కా వి­ద్యు­త్తు కా­ర్లు, వై­న్స్‌, పె­ట్రో­కె­మి­క­ల్స్‌, యా­పి­ల్స్‌, నట్స్‌ వంటి ఉత్ప­త్తు­ల­పై భా­ర­త్‌ తక్కువ టా­రి­ఫ్‌­లు వి­ధిం­చా­లం­టూ ఒత్తి­డి తె­స్తోం­ది.

అమె­రి­కా ప్ర­భు­త్వం ఇప్ప­టి­కే భా­ర­త్ నుం­చి ది­గు­మ­త­య్యే పలు ఉత్ప­త్తు­ల­పై 26 శాతం టా­రి­ఫ్‌ వి­ధిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. అయి­తే ఇది జులై 9 వరకు తా­త్కా­లి­కం­గా ని­లి­పి­వే­శా­రు. ట్రం­ప్‌ ప్ర­భు­త్వం మరో­సా­రి ఈ మి­న­హా­యిం­పు­ను పొ­డి­గిం­చే ఉద్దే­శం లే­ద­ని ఇప్ప­టి­కే స్ప­ష్టం చే­సిన నే­ప­థ్యం­లో, భా­ర­త్‌ ఈ టా­రి­ఫ్‌­ల­పై రా­యి­తీ­లు కో­రు­తోం­ది. ప్ర­స్తు­తం బే­స్‌­లై­న్ టా­రి­ఫ్‌ 10 శా­తం­గా కొ­న­సా­గు­తు­న్నా, అద­నం­గా వి­ధిం­చ­బో­యే 26 శాతం పన్ను భారం భా­ర­త్‌ ఎగు­మ­తు­ల­పై తీ­వ్ర ప్ర­భా­వం చూపే అవ­కా­శ­ముం­ది. ఇదే నే­ప­థ్యం­లో వా­ణి­జ్య­శాఖ ప్ర­త్యేక కా­ర్య­ద­ర్శి రా­జే­ష్‌ అగ­ర్వా­ల్‌ వా­షిం­గ్ట­న్‌­లో తుది విడత చర్చ­లు ప్రా­రం­భిం­చా­రు. టా­రి­ఫ్‌ల సస్పె­న్ష­న్ గడు­వు ము­గి­య­డా­ని­కి ముం­దే ఈ ఒప్పం­దం కు­ది­రి­తే, ఇరు­దే­శాల వా­ణి­జ్య సం­బం­ధా­ల్లో కొ­త్త పుం­త­లు తొ­క్కే అవ­కా­శం ఉం­టుం­ది. జులై 8 లోగా కీలక ప్ర­క­టన వె­లు­వ­డే అవ­కా­శం ఉంది. మినీ ట్రే­డ్ డీల్ ద్వా­రా భా­ర­త్‌–అమె­రి­కా మధ్య కొ­న­సా­గు­తు­న్న కొ­న్ని వా­ణి­జ్య వి­వా­దా­ల­కు తా­త్కా­లిక పరి­ష్కా­రం దొ­ర­కొ­చ్చ­న్న అం­చ­నా­లు ఉన్నా­యి. దీని ప్ర­భా­వం ఫా­ర్మా, టె­క్స్‌­టై­ల్, వ్య­వ­సాయ రం­గా­ల­పై కని­పిం­చ­నుం­ది.

Tags

Next Story