Trump Effect : ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ లో రూ.7 లక్షల కోట్ల ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ 1,235 పాయింట్లు, నిఫ్టీ 299 పాయింట్లు డౌన్ అయ్యాయి. సెన్సెక్స్ 76 వేల పాయింట్ల దిగువకు పడిపోయి 75,838 వద్ద ముగియగా, నిఫ్టీ 23,045 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ఓ సమయంలో 1,300 పాయింట్ల మేర నష్టపోయింది. చివరలో కాస్త కోలుకున్నప్పటికీ భారీ నష్టాల్లోనే ముగిసింది. మార్కెట్ కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.7 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.424 లక్షల కోట్లకు పడిపోయింది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టగానే పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలపై ట్రేడ్ టారిఫ్ విధిస్తామని ప్రకటించారు. భారత్ సహా ఇతర దేశాలపై సుంకాలు విధిస్తామని గతంలోనే చెప్పారు. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com