Trump Tariffs : గోల్డ్ జ్యువెలరీకి విలన్‌గా మారిన ట్రంప్.. ఎగుమతుల్లో 31% పతనం.

Trump Tariffs : గోల్డ్ జ్యువెలరీకి విలన్‌గా మారిన ట్రంప్.. ఎగుమతుల్లో 31% పతనం.
X

Trump Tariffs : ఈ ఏడాది బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా అక్టోబర్ నెలలో అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి దేశీయ మార్కెట్ వరకు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దీని కారణంగా ఆభರಣాల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. దీనికి తోడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు కూడా విలన్‌లా తయారయ్యాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ రత్నాలు, ఆభరణాల డిమాండ్ తగ్గిపోయింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అక్టోబర్ నెలలో ఎగుమతుల్లో ఏకంగా 31 శాతం భారీ తగ్గుదల కనిపించింది.

పరిశ్రమల సంస్థ జీజేఈపీసీ విడుదల చేసిన డేటా ప్రకారం.. అక్టోబర్‌లో భారతదేశ రత్నాలు, ఆభరణాల మొత్తం ఎగుమతి విలువ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 30.57 శాతం తగ్గి $2168.05 మిలియన్ల (సుమారు రూ.19,172.89 కోట్లు)కి చేరుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఇది $3122.52 మిలియన్లుగా ఉండేది.

ఈ భారీ తగ్గుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది జీజేఈపీసీ అధ్యక్షుడు కిరీట్ భన్సాలీ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్‌లో ఎగుమతి తగ్గుదలకు ప్రధాన కారణం అమెరికా టారిఫ్‌లు అమలులోకి రావడం. ఈ పన్నులు అమలు కాకముందే, అంటే ఆగస్టు 27వ తేదీకి ముందే పండుగల కోసం అవసరమైన చాలా స్టాక్‌ను విదేశీ మార్కెట్‌లు కొనుగోలు చేశాయి. రెండోది.. ముందస్తుగా నిల్వలు పెరగడం వల్ల అక్టోబర్‌లో కొత్త డిమాండ్ తగ్గిపోయింది. అలాగే, బంగారం, వెండి ధరల్లో మార్కెట్ అనిశ్చితి కూడా ఎగుమతి క్షీణతకు కారణమైంది.

ఏయే విభాగాల్లో నష్టం?

అక్టోబర్‌లో వివిధ ఉప-రంగాలలో ఎగుమతులు ఈ విధంగా తగ్గాయి

* కట్, పాలిష్డ్ వజ్రాలు: ఎగుమతులు 26.97 శాతం తగ్గి $1,025.99 మిలియన్లకు చేరుకున్నాయి.

* ల్యాబ్‌లో తయారైన వజ్రాలు: వీటి ఎగుమతులు మరింత ఎక్కువగా 34.90 శాతం తగ్గి $94.37 మిలియన్లకు పడిపోయాయి.

* బంగారు ఆభరణాలు: గోల్డ్ జ్యువెలరీ ఎగుమతి కూడా 28.4 శాతం తగ్గి $850.15 మిలియన్లుగా నమోదైంది.

* వెండి ఆభరణాలు: వీటి ఎగుమతుల్లో 16 శాతం తగ్గుదల కనిపించింది.

భవిష్యత్తు అంచనా

ప్రస్తుతానికి ఎగుమతులు తగ్గినప్పటికీ, నవంబర్ నెల నుంచి పరిస్థితి మెరుగుపడుతుందని జీజేఈపీసీ ఆశాభావం వ్యక్తం చేసింది. చైనా మార్కెట్ నెమ్మదిగా పుంజుకోవడం, అలాగే ఇతర ప్రధాన మార్కెట్‌లలో క్రిస్మస్ పండుగ డిమాండ్ పెరగడం వల్ల ఎగుమతులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Tags

Next Story