TVS iQube : ప్రతి నెల రూ.5 వేలతో టీవీఎస్ ఐక్యూబ్ టాప్ మోడల్ సొంతం చేసుకోండి..అస్సలు మిస్సవద్దు.

TVS iQube : భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ఆలస్యంగా ప్రవేశించినా, టీవీఎస్ మోటార్ కంపెనీ తన టీవీఎస్ ఐక్యూబ్ తో అతి తక్కువ సమయంలోనే విశేషమైన ప్రజాదరణ పొందింది. ఓలా, ఏథర్ వంటి కొత్త ఈవీ దిగ్గజాల పోటీని తట్టుకొని నిలబడిన ఐక్యూబ్, ఆకర్షణీయమైన ధర, ప్రాక్టికల్ డిజైన్, మంచి పర్ఫార్మెన్స్‌తో వినియోగదారులకు బాగా నచ్చింది. ఈ స్కూటర్ టాప్ మోడల్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి, నెలకు కేవలం రూ.5,000 లోపే ఈఎంఐ చెల్లించే అవకాశం ఉందని తాజా లెక్కలు చెబుతున్నాయి. ఈ టాప్ మోడల్ ఒక్క ఛార్జింగ్‌పై 145 కి.మీ.ల రేంజ్‌ను అందిస్తుంది.
టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ ప్రాక్టికల్ డిజైన్, మంచి పర్ఫార్మెన్స్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఇది మూడు ప్రధాన మోడల్స్‌లో లభిస్తుంది: స్టాండర్డ్, ఎస్, ఎస్‌టీ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.94,434 నుంచి రూ.1,58,834 మధ్య ఉంది. ధరలు, మోడల్, ఎంచుకున్న బ్యాటరీ ప్యాక్‌పై ఆధారపడి ఉంటాయి. ఈ స్కూటర్ మార్కెట్‌లో ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇస్తోంది.
ఐక్యూబ్‌లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల బ్యాటరీ ప్యాక్‌లను టీవీఎస్ అందిస్తోంది. ఈ స్కూటర్‌లో 2.2 kWh, 3.1 kWh, 3.5 kWh సామర్థ్యం గల మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. మిడ్ వేరియంట్ ఎస్ 3.5 kWh బ్యాటరీతో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1,17,642. టాప్ వేరియంట్ ఎస్‌టీ ఇది 3.5 kWh, 5.3 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. బేస్ వేరియంట్ (2.2 kWh) ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 94 కి.మీ. వరకు ప్రయాణించగలదు. అయితే, 3.5 kWh బ్యాటరీ ఉన్న వేరియంట్ 145 కి.మీ. వరకు మెరుగైన రేంజ్‌ను ఇస్తుంది.
ఐక్యూబ్ టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి ఈజీ ఫైనాన్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ టాప్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ.1.70 లక్షలుగా ఉంది. ఉదాహరణకు, ఒకవేళ రూ.1.50 లక్షల వరకు లోన్ తీసుకుంటే, 12 శాతం వడ్డీ రేటుతో ఈఎంఐలు ఇలా ఉంటాయి. 24 నెలలకు సుమారు రూ.7,712, 36 నెలలకు (3 ఏళ్లు) సుమారు రూ.5,639. ఒకవేళ వినియోగదారు రూ.35,000 వరకు డౌన్ పేమెంట్ చెల్లించినట్లయితే, 36 నెలల కాలానికి ఈఎంఐ రూ.5,000 దగ్గరగా ఉండే అవకాశం ఉంది.
గమనిక: వడ్డీ రేట్లు బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థను బట్టి మారుతుంటాయి. డౌన్ పేమెంట్ పెంచడం, తక్కువ వడ్డీ రేటుకు లోన్ తీసుకోవడం ద్వారా ఈఎంఐ భారాన్ని మరింత తగ్గించుకోవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

