TVS : రూ.1.99లక్షలకే అదిరే ఫీచర్లతో టీవీఎస్ తొలి అడ్వెంచర్ బైక్ లాంచ్.. రాయల్ ఎన్‌ఫీల్డ్, కేటీఎంకు గట్టి పోటీ!

TVS : రూ.1.99లక్షలకే అదిరే ఫీచర్లతో టీవీఎస్ తొలి అడ్వెంచర్ బైక్ లాంచ్.. రాయల్ ఎన్‌ఫీల్డ్, కేటీఎంకు గట్టి పోటీ!
X

TVS : దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్, అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం తమ మొట్టమొదటి అడ్వెంచర్ టూరర్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అదే కొత్త టీవీఎస్ అపాచీ RTX 300. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.99 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్ ఇప్పుడు మార్కెట్‌లో గట్టి పోటీ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440, కేటీఎం 250 అడ్వెంచర్, యెజ్డీ అడ్వెంచర్ వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ కొత్త బైక్‌ను సరికొత్త నెక్స్ట్-జనరేషన్ టీవీఎస్ RT-XD4 ఇంజిన్ ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేశారు. ఇది రేసింగ్ లెవల్ పర్ఫామెన్స్, లాంగ్ జర్నీల కోసం సౌకర్యవంతమైన రైడింగ్‌ను అందిస్తూ, లేటెస్ట్ అడ్వెంచర్ రైడింగ్‌కు కొత్త ప్రమాణంగా నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ప్రత్యేకమైన ప్లాట్‌ఫారమ్‌లో నాలుగు డ్యూయల్ టెక్నాలజీలు ఉన్నాయి: డ్యూయల్ ఓవర్‌హెడ్ కామ్, డౌన్‌డ్రాఫ్ట్ పోర్ట్, డ్యూయల్ ఆయిల్ పంప్‌తో స్ప్లిట్ ఛాంబర్ క్రాంక్‌కేస్, డ్యూయల్ కూలింగ్ జాకెట్ సిలిండర్ హెడ్, డ్యూయల్ బ్రీథర్ సిస్టమ్.

కొత్త టీవీఎస్ అపాచీ RTX 300 లో 299.1సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 36PS పవర్, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 28.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్-అండ్-స్లిప్పర్ క్లచ్‌తో వస్తుంది. ఈ బైక్‌లో అర్బన్, రెయిన్, టూర్, ర్యాలీ అనే నాలుగు రైడ్ మోడ్స్ ఉన్నాయి. దీని వల్ల రైడర్ రోడ్డు లేదా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బైక్ పర్ఫామెన్స్ సెలక్ట్ చేసుకోవచ్చు.

ఈ బైక్ హ్యాండ్లింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ముందు భాగంలో ఇన్వర్టెడ్ కార్ట్రిడ్జ్ ఫోర్క్, వెనుక భాగంలో మోనో-ట్యూబ్ ఫ్లోటింగ్ పిస్టన్ తో కూడిన సస్పెన్షన్ సెటప్‌ను ఇచ్చారు. బైక్‌ను తేలికపాటి స్టీల్ ట్రైల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించారు. ఇందులో ఐ-షేప్ LED హెడ్‌ల్యాంప్, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, ట్రాన్స్పరెంట్ విండ్‌స్క్రీన్, ముందు వైపు బీక్ లాంటి డిజైన్‌ను అందించారు. ఈ బైక్ పర్ల్ వైట్, వైపర్ గ్రీన్, లైటింగ్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, టార్న్ బ్రాంజ్ అనే 5 రంగుల్లో అందుబాటులో ఉంది.

ఫీచర్ల విషయానికి వస్తే, అపాచీ RTX 300 లో కంప్లీట్ కలర్ TFT డిస్‌ప్లే ఉంది. ఇందులో కాల్, SMS అలర్ట్‌లు, స్పీడ్, గోప్రో కంట్రోల్, సెగ్మెంట్‌లో మొట్టమొదటి మ్యాప్ మిర్రరింగ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఇంకా ఈ బైక్‌లో రెండు మోడ్‌లతో కూడిన ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ మోడ్స్ (ర్యాలీ, అర్బన్, రెయిన్), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ టెక్నాలజీలను ఇచ్చారు. ఈ ఫీచర్ల కారణంగా ఇది తన సెగ్మెంట్‌లో అత్యంత ఫీచర్-ప్యాక్డ్ అడ్వెంచర్ బైక్‌గా నిలిచింది.

Tags

Next Story