TVS Orbiter V1 : టీవీఎస్ సంచలనం.. కేవలం రూ.49,999కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే ఆఫర్.

TVS Orbiter V1 : ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు టీవీఎస్ మోటార్ కంపెనీ సిద్ధమైంది. సామాన్యుడికి కూడా ఈవీని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో, సరికొత్త బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఆర్బిటర్ V1ను అత్యంత తక్కువ ధరకే లాంచ్ చేసింది. ఈ కొత్త ప్రోగ్రామ్ ద్వారా బ్యాటరీ ధరను స్కూటర్ ధర నుంచి వేరు చేయడం వల్ల ప్రారంభ పెట్టుబడి భారీగా తగ్గుతుంది.
ధర విషయానికొస్తే.. మీరు ఈ ఆర్బిటర్ V1 (1.8 kWh వేరియంట్)ను నేరుగా బ్యాటరీతో కలిపి కొనాలనుకుంటే రూ. 84,500 (ఎక్స్‌షోరూమ్) ఖర్చవుతుంది. అదే మీరు BaaS ప్రోగ్రామ్ కింద కొనుగోలు చేస్తే, కేవలం రూ. 49,999 (ఎక్స్‌షోరూమ్) చెల్లిస్తే సరిపోతుంది. అంటే ప్రారంభంలోనే మీకు దాదాపు రూ.34,500 ఆదా అవుతుంది. మిగిలిన మొత్తాన్ని మీరు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా ప్రతి నెలా కొంత మొత్తంలో చెల్లించవచ్చు. ఈ ప్లాన్లు నెలకు కేవలం రూ.862 నుంచి ప్రారంభమవుతాయి. ఇది కిలోమీటరుకు సుమారు రూ.1.20 ఖర్చుతో సమానం.
టీవీఎస్ ఆర్బిటర్ V1 ఫీచర్ల విషయానికొస్తే, ఇది పట్టణ ప్రయాణాలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో 1.8 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 86 కిలోమీటర్ల (IDC) రేంజ్ ఇస్తుంది. కేవలం 2 గంటల 20 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఇందులో 34 లీటర్ల భారీ అండర్ సీట్ స్టోరేజ్, కనెక్టెడ్ మొబైల్ యాప్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్స్‌తో కూడిన కలర్డ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వంటి హైటెక్ ఫీచర్లు ఉన్నాయి.
మరోవైపు, మరింత ఎక్కువ రేంజ్ కావాలనుకునే వారి కోసం ఆర్బిటర్ V2 వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఇందులో 3.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, ఇది ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా 158 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అయితే, ప్రస్తుతం ఆర్బిటర్ V2 మోడల్ BaaS స్కీమ్ కింద అందుబాటులో లేదు. BaaS ప్లాన్ తీసుకోవడం వల్ల మరో పెద్ద లాభం ఏంటంటే, మీకు బ్యాటరీపై 5 ఏళ్లు లేదా 70,000 కిలోమీటర్ల వరకు ఎక్స్‌టెండెడ్ వారంటీ లభిస్తుంది, దీనివల్ల బ్యాటరీ లైఫ్ గురించి అస్సలు ఆందోళన చెందక్కర్లేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
